Samantha: దాని కోసం యాచించాల్సిన అవసరం నాకు లేదు..: సమంత
తాజాగా ఓ ఇంటర్వ్యూలో సమంత (Samantha) నటీనటుల సమాన పారితోషికం గురించి మాట్లాడింది. నటించే వారి కష్టాన్ని చూసి పారితోషికం ఇవ్వాలని ఆమె కోరింది.
హైదరాబాద్: సినిమారంగంలో ఉన్న అగ్ర కథానాయికల్లో సమంత (Samantha) ఒకరు. గ్లామర్ పాత్రలతో పాటు నటనకు ప్రాధాన్యం ఉన్న హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలు చేస్తూ ఇండస్ట్రీలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. త్వరలోనే ఈ టాలెంటెడ్ హీరోయిన్ ‘శాకుంతలం’ (Shaakuntalam) సినిమాతో ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధంగా ఉంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన సామ్ నటీనటుల పారితోషికం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
చిత్ర పరిశ్రమలో నటీనటులకు సమాన పారితోషికం గురించి మాట్లాడిన సామ్.. ‘‘నేను ప్రత్యక్షంగా కాకపోయినా ఈ విషయంపై పోరాడుతున్నాను. అలాగని సమానంగా పారితోషికం ఇవ్వాలని నేను పోరాతున్నట్లు కాదు.. కష్టాన్ని చూసి రెమ్యునరేషన్ ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. నా శ్రమ చూసి ‘మేము మీకు ఇంత పారితోషికం ఇవ్వాలనుకుంటున్నాం’ అని సినిమాకు చెందిన వాళ్లే చెప్పాలి. అంతేకానీ నాకు ఇంత రెమ్యునరేషన్ ఇవ్వండి అని నేను యాచించాల్సిన అవసరం లేదు. మన కృషి ఆధారంగా ఇది వస్తుందని నేను నమ్ముతాను. ఎప్పటికప్పుడు మన సామర్థ్యాలను పెంచుకుంటూ పోవాలి’’ అని చెప్పింది. ఇక ప్రేమ గురించి మాట్లాడిన సమంత.. ప్రేమ అనేది స్త్రీ, పురుషుల మధ్య మాత్రమే కాదని.. ఇద్దరు స్నేహితుల మధ్య కూడా ప్రేమానురాగాలు ఉంటాయని చెప్పింది. ఒక రిలేషన్‌లో విఫలమైతే అంతా అయిపోయినట్లు కాదు అని ఆమె తెలిపింది.
ఇక సమంత ప్రధాన పాత్రలో నటించిన ‘శాకుంతలం’ సినిమా ఏప్రిల్ 14న విడుదల కానుంది. ఇప్పటికే ట్రైలర్, ఫస్ట్ లుక్‌లతో చిత్రబృందం ఈ సినిమాపై అంచనాలు పెంచేసింది. గత కొన్నిరోజులుగా వరస ఇంటర్వ్యూలు ఇస్తూ సినిమాపై ఆసక్తికర విషయాలు పంచుకుంటున్నారు. ఈరోజు సాయంత్రం ఈ సినిమాకు సంబంధించిన త్రీడీ ట్రైలర్‌ను విడుదలచెయ్యనున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Amaravati: ఏపీ సచివాలయంలో 50 మంది అసిస్టెంట్ సెక్రటరీలకు రివర్షన్
-
Law Commission: ‘జమిలి’ నివేదికపై కసరత్తు జరుగుతోంది.. లా కమిషన్ ఛైర్మన్
-
IND vs AUS: టీమ్ఇండియా ఆలౌట్.. మూడో వన్డేలో ఆస్ట్రేలియా విజయం
-
Cheetah : భారత్‌కు ఉత్తర ఆఫ్రికా దేశాల చీతాలు.. పరిశీలిస్తున్న అధికారులు!
-
Sreeleela: వాటి ఎంపికలో జాగ్రత్తగా ఉంటా.. ఆ జానర్‌పై ఇష్టం పెరిగింది: శ్రీలీల
-
TS News: తెలంగాణలో కొత్త రెవెన్యూ డివిజన్లు .. నేటి నుంచి అమల్లోకి