Samantha: సమంత ‘శాకుంతలం’ మళ్లీ వాయిదా..
Shaakuntalam: సమంత కీలక పాత్రలో గుణశేఖర్ దర్శకత్వం వహించిన హిస్టారికల్ మూవీ ‘శాకుంతలం’ మరోసారి వాయిదా పడింది. కొత్త విడుదల తేదీని త్వరలోనే ప్రకటిస్తామని చిత్ర బృందం తెలిపింది.
ఇంటర్నెట్‌డెస్క్: ‘శాకుంతలం’ (Shaakuntalam) చిత్రానికి వాయిదా కష్టాలు తప్పడం లేదు. ఇప్పటికే రెండు, మూడు సార్లు విడుదల వాయిదా పడిన ఈ చిత్రం ఇంకాస్త ఆలస్యం కానుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ చిత్ర బృందం ట్వీట్ చేసింది. సమంత (Samantha) టైటిల్ రోల్‌లో గుణశేఖర్ తెరకెక్కిస్తున్న హిస్టారికల్ మూవీ ఇది. ఎప్పుడో చిత్రీకరణ పూర్తి చేసుకున్న ‘శాకుంతలం’ నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. తొలుత అనుకున్న షెడ్యూల్ ప్రకారం.. ఫిబ్రవరి 17న ఈ సినిమాను రిలీజ్ చేయాలని నిర్ణయించారు. కానీ, ఇప్పుడు విడుదలను వాయిదా వేశారు.
‘ప్రియమైన ప్రేక్షకులకు ఈ విషయాన్ని చెప్పడానికి ఎంతో విచారిస్తున్నాం. ఫిబ్రవరి 17న శాకుంతలం చిత్రాన్ని విడుదల చేయలేకపోతున్నాం. కొత్త తేదీని త్వరలోనే ప్రకటిస్తాం. మీ ప్రేమ, సహకారానికి ధన్యవాదాలు’ అని చిత్ర బృందం తెలిపింది. శకుంతలగా సమంత కనిపించనుంది. దుష్యంతుడి పాత్రలో దేవ్ మోహన్, దుర్వాస మహర్షిగా మోహన్‌బాబు, అనసూయగా అదితి బాలన్ నటిస్తుండగా, అల్లు అర్హ అతిథి పాత్రలో మెరవనున్నారు. ఇప్పటికే విడుదల చేసిన ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచుతోంది. మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని నీలిమా గుణ నిర్మిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Salaar: ‘సలార్’ రిలీజ్ ఆరోజేనా?.. వైరల్‌గా ప్రశాంత్ నీల్ వైఫ్ పోస్ట్
-
IND vs AUS: భారత్‌ను ఓడించిన జట్టు ప్రపంచకప్ గెలుస్తుంది: మైఖేల్ వాన్
-
Prabhas Statue: ప్రభాస్ ‘బాహుబలి’ మైనపు విగ్రహం.. నిర్మాత ఆగ్రహం..!
-
Interpol: ఖలిస్థాన్ ఉగ్రవాది కరణ్‌వీర్‌సింగ్ కోసం ఇంటర్‌పోల్ రెడ్‌కార్నర్ నోటీస్
-
Social Look: చీరలో పూజా మెరుపులు.. రకుల్ పోజులు.. దివి కవిత్వం ఎవరికోసమో తెలుసా..?
-
Black Sea: రష్యాకు ఎదురుదెబ్బ.. నౌకాదళ కమాండర్ సహా 34 మంది మృతి!