Samantha: కొందరు ఎప్పుడైనా మనతోనే ఉంటారు
సమంత, విజయ్ దేవరకొండ ‘ఖుషి’ కోసం తుర్కియేలో ఆటపాటలతో సరదాగా గడిపేస్తున్నారు. మధ్యలో చిత్రీకరణ నుంచి కాస్త విరామం దొరకడంతో ఈ ఇద్దరూ ఎంచక్కా లంచ్‌కు వెళ్లిపోయారు.
సమంత, విజయ్ దేవరకొండ ‘ఖుషి’ కోసం తుర్కియేలో ఆటపాటలతో సరదాగా గడిపేస్తున్నారు. మధ్యలో చిత్రీకరణ నుంచి కాస్త విరామం దొరకడంతో ఈ ఇద్దరూ ఎంచక్కా లంచ్‌కు వెళ్లిపోయారు. దీనికి సంబంధించిన ఓ ఫొటోను నెట్లో పోస్ట్‌చేస్తూ విజయ్‌తో తనకున్న అనుబంధాన్ని అభిమానులతో పంచుకుంది సమంత. ‘‘నువ్వు చివర్లో ఉండటాన్ని చూశా.. ప్రథమ స్థానంలోకి వచ్చినప్పుడూ చూశా. నీ ఉన్నత స్థాయిని చూశా.. నీ జీవితంలో దాటొచ్చిన ఎత్తుపల్లాలను చూశా. ఎలాంటి సమయాల్లోనైనా కొంత మంది స్నేహితులు మనతోనే ఉండిపోతారు’’ అని తన ట్వీట్‌లో రాసుకొచ్చింది సమంత. ఈ పోస్ట్‌పై విజయ్ బదులిస్తూ.. ‘‘సామ్ నా ఫేవరెట్ లేడీ’’ అని పేర్కొన్నారు. దీంతో వీరి స్నేహం చూడముచ్చటగా ఉందంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. కశ్మీర్ నేపథ్యంలో సాగే విభిన్న ప్రేమకథగా రూపొందుతోన్న ఈ ‘ఖుషి’ చిత్రం ఇప్పుడు ముగింపు దశ చిత్రీకరణలో ఉంది. ప్రస్తుతం తుర్కియేలో సామ్, విజయ్‌లపై ఓ పాట చిత్రీకరిస్తున్నారు. ఈ షెడ్యూల్ ముగిసిన వెంటనే హైదరాబాద్‌లో మరో చిన్న షెడ్యూల్ పూర్తి చేసి.. జూన్ నెలాఖరు నాటికి సినిమాకి గుమ్మడికాయ కొట్టనున్నారు. శివ నిర్వాణ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం సెప్టెంబరు 1న థియేటర్లలోకి రానుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
Humsafar Express: హమ్‌సఫర్ ఎక్స్‌ప్రెస్ రైల్లో మంటలు
-
Narendra Modi: ఈ స్టేడియం ఆ మహాదేవుడికే అంకితం: ప్రధాని నరేంద్ర మోదీ
-
Rishi Sunak: సిగరెట్లపై నిషేధం విధించనున్న సునాక్ ప్రభుత్వం!
-
Hyderabad: మాదాపూర్‌లో క్షణాల్లో నేలమట్టమైన బహుళ అంతస్తుల భవనాలు
-
Phonepe appstore: గూగుల్‌కు పోటీగా ఫోన్‌పే కొత్త యాప్‌స్టోర్