Samantha: విజయ్.. నీ కష్టసుఖాలు నేను చూశా: సమంత
నటుడు విజయ్ దేవరకొండ (Vijay Deverakonda)ను ఉద్దేశిస్తూ ఆసక్తికర పోస్ట్ పెట్టారు నటి సమంత (Samantha). విజయ్‌తో తనకున్న స్నేహాన్ని ఆమె ఈ పోస్ట్‌తో తెలియజేశారు.
హైదరాబాద్: ‘ఖుషి’ (Kushi) కో-స్టార్, నటుడు విజయ్ దేవరకొండ (Vijay Deverakonda)ను ఉద్దేశిస్తూ నటి సమంత (Samantha) ఆసక్తికర పోస్ట్ పెట్టారు. తమ తదుపరి ప్రాజెక్ట్ షూట్‌లో భాగంగా తుర్కియేలో ఉన్న వీరిద్దరూ లంచ్ డేట్‌కు వెళ్లారు. దీనికి సంబంధించిన ఓ ఫొటోని సామ్ ఇన్‌స్టా వేదికగా షేర్ చేస్తూ.. విజయ్‌తో తనకు ఉన్న అనుబంధాన్ని నెటిజన్లతో పంచుకున్నారు.
‘‘విజయ్ దేవరకొండ.. నీ ఉన్నతస్థాయి, సంతోషాలను అలాగే నీ కష్టాలనూ నేను చూశా. నువ్వు చివర్లో ఉండటాన్ని చూశా. ప్రథమస్థానంలోకి వచ్చినప్పుడూ చూశా. నీ జీవితంలోని ఎత్తుపల్లాలను చూశా. ఎలాంటి సమయాల్లోనైనా కొంతమంది స్నేహితులు మనతోనే ఉండిపోతారు’’ అని ఆమె రాసుకొచ్చారు. దీనిపై రౌడీ బాయ్ స్పందిస్తూ.. సామ్ తన ఫేవరెట్ లేడీ అని చెప్పారు. ప్రస్తుతం ఈ ఫొటో నెట్టింట వైరల్‌గా మారింది. దీనిని చూసిన నెటిజన్లు.. వీరి ఫ్రెండ్‌షిప్ చూడముచ్చటగా ఉందని అంటున్నారు.
‘మహానటి’ తర్వాత విజయ్ దేవరకొండ - సమంత కలిసి నటిస్తోన్న చిత్రం ‘ఖుషి’. శివ నిర్వాణ దర్శకుడు. కశ్మీర్ నేపథ్యంలో సాగే ప్రేమకథతో ఇది రూపుదిద్దుకుంటోంది. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ తుర్కియేలో జరుగుతోంది. మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై ఇది నిర్మితమవుతోంది. మరోవైపు, ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన మొదటి పాట యూట్యూబ్‌లో సినీ ప్రియులను ఆకట్టుకుంటోన్న విషయం తెలిసిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
పుంగనూరు కేసులో కుమారుడికి బెయిల్ రాలేదని.. తల్లి ఆత్మహత్యాయత్నం
-
Supreme Court: అరుదైన ఘట్టం.. సంజ్ఞల భాషలో సుప్రీంకోర్టులో వాదన
-
TS TET Results: రేపు టెట్ ఫలితాలు
-
ఏసీ వేసుకుని నిద్రపోయిన డాక్టర్.. చలికి ఇద్దరు నవజాత శిశువుల మృతి
-
Imran khan: త్వరలో సకల సౌకర్యాలున్నజైలుకు ఇమ్రాన్
-
Chandrababu: నేడు సుప్రీంకోర్టు ముందుకు చంద్రబాబు పిటిషన్