Samantha: హీనా ఖాన్‌ నువ్వు వారియర్‌వి.. నటికి ధైర్యాన్నిచ్చిన సమంత

హీనా ఖాన్‌కు ధైర్యాన్నిస్తూ సమంత పోస్ట్‌ పెట్టారు. ఆమెను వారియర్‌గా పేర్కొన్నారు.

Published : 02 Jul 2024 16:26 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: తాను స్టేజ్‌ 3 బ్రెస్ట్ క్యాన్సర్‌తో బాధపడుతోన్నట్లు హీనా ఖాన్‌ ఇటీవల తెలిపిన సంగతి తెలిసిందే. దీంతో సినీ ఇండస్ట్రీలోని ప్రముఖలు ఆమెకు ధైర్యాన్నిస్తున్నారు. తాజాగా హీనా ఖాన్‌ను ఉద్దేశిస్తూ సమంత (Samantha) పోస్ట్‌ పెట్టారు. హీనాకు సంబంధించిన వీడియో పోస్ట్‌ చేసిన సమంత ‘నీకోసం నేను ప్రార్థిస్తాను. ధైర్యంగా ఉండు’ అని రాశారు. దానికి వారియర్‌ అనే హ్యాష్‌ ట్యాగ్‌ను జోడించారు. ఈ పోస్ట్‌కు హీనా (Hina Khan) స్పందిస్తూ.. ‘సమంత మీరు అన్నిట్లోనూ స్టార్‌. జీవితం విసిరిన సవాళ్లను హ్యాండిల్ చేసిన విధానం అద్భుతం. మీ గురించి తెలుసుకొని ఎంతో స్ఫూర్తి పొందాను. మీ ప్రేమ, ఆశీర్వచనాలకు ధన్యవాదాలు’ అని పేర్కొన్నారు.

ఫ్యామిలీతో కలిసి ఓటీటీలో మూవీస్‌ చూడాలనుకుంటున్నారా?ఇవి బెస్ట్‌ ఛాయిస్‌..!

బాలీవుడ్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన నటీనటులలో హీనా ఖాన్ ఒకరు. ఆమె క్యాన్సర్‌ బారిన పడినట్లు తెలుపుతూ ఇటీవల ఇన్‌స్టాలో పోస్ట్‌ పెట్టారు. తన కుటుంబసభ్యులు, స్నేహితుల సహకారంతో క్యాన్సర్‌ మహమ్మారితో పోరాటం చేస్తున్నానని తెలిపారు. ‘ఇది నాకు సవాలుతో కూడిన సమయం. అయినా మానసికంగా దృఢంగా ఉన్నా. ఎలాగైనా ఈ వ్యాధి నుంచి బయటపడాలన్న పట్టుదలతో ఉన్నా. ఇప్పటికే నాకు చికిత్స మొదలైంది. ఈ వ్యాధితో పోరాడేందుకు ఏం చేయడానికైనా నేను సిద్ధం! అయితే నేను మీ అందరినీ కోరేది ఒక్కటే.. ఈ కష్ట సమయంలో మీ వ్యక్తిగత అనుభవాలు, సలహాలు, మద్దతును అందించండి.. అప్పుడే ఒంటరిని కాదన్న భావన నాకు కలుగుతుంది’ అని పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని