Samantha: అభిమాన హీరో సరసన?

సినిమాల్లో వారి నటనతో ఎంతో మంది అభిమానుల్ని సొంతం చేసుకునే అందాల తారలకూ ఆరాధించే నటీనటులుంటారు. తానెంతో అభిమానించే వ్యక్తి మమ్ముట్టి..

Published : 14 Jun 2024 00:45 IST

సినిమాల్లో వారి నటనతో ఎంతో మంది అభిమానుల్ని సొంతం చేసుకునే అందాల తారలకూ ఆరాధించే నటీనటులుంటారు. తానెంతో అభిమానించే వ్యక్తి మమ్ముట్టి.. అని చెప్పుకొచ్చే సమంత.. ఇప్పుడు ఆయనతో తెరను పంచుకోనుందా? అంటే అవుననే అంటున్నాయి సినీవర్గాలు. మమ్ముట్టి ప్రధాన పాత్రలో గౌతమ్‌ వాసుదేవ్‌మేనన్‌ ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఇందులో కథానాయికగా సమంత నటిస్తున్నట్లు సమాచారం. ‘‘ఇంతక ముందు ఈ ప్రాజెక్టులో మమ్ముట్టికి జోడీగా నయనతారను ఎంపిక చేసింది చిత్రబృందం. కొన్ని కారణాల వల్ల ఆ స్థానంలో నటించడానికి సమంతను తీసుకున్నారు. ప్రస్తుతం ఆమెతో చిత్రబృందం చర్చలు జరుపుతుంది. తెలుగు, తమిళ పరిశ్రమల్లో ఇప్పటికే తానెంటో నిరూపించుకున్న ఆమె..ఈ సినిమాతో మలయాళంలోకి అడుగుపెట్టనుంది. త్వరలో దీనికి సంబంధించిన వివరాల్ని ప్రకటించనుంది చిత్రబృందం’’ అని సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఈ నెల 15నుంచి ఈ సినిమా షూటింగ్‌ ప్రారంభిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ‘మా ఇంటి బంగారం’తో బిజీగా ఉంది సమంత.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని