Samantha: సల్మాన్‌ వీడియోపై సామ్‌ ‘లవ్‌’ రిప్లై

తన వర్క్‌ని గుర్తించిన బాలీవుడ్‌ స్టార్‌ హీరో సల్మాన్‌ఖాన్‌కు(Salman Khan) అగ్రకథానాయిక సమంత (Samantha) ప్రేమతో కృతజ్ఞతలు తెలిపారు. ‘పుష్ప’లో(Pushpa) సమంత నృత్యం చేసిన ‘ఊ అంటావ.....

Published : 28 Jun 2022 02:03 IST

హైదరాబాద్‌: తన వర్క్‌ని గుర్తించిన బాలీవుడ్‌ స్టార్‌ హీరో సల్మాన్‌ఖాన్‌కు(Salman Khan) అగ్రకథానాయిక సమంత (Samantha) ప్రేమతో కృతజ్ఞతలు తెలిపారు. ‘పుష్ప’లో(Pushpa) సమంత నృత్యం చేసిన ‘ఊ అంటావా మావ ఊఊ అంటావా’’ అనే పాట తనకెంతో నచ్చిందని ఇటీవల జరిగిన ఇండియన్‌ ఫిల్మ్‌ అకాడమీ అవార్డుల ప్రదానోత్సవంలో (ఐఫా) (IIFA) సల్మాన్‌ వెల్లడించారు. తాజాగా దీనికి సంబంధించిన వీడియోని ఓ నెటిజన్‌ ట్విటర్‌లో షేర్‌ చేయగా.. అది సామ్‌ కంటపడింది. ఆ వీడియోపై ఆమె స్పందిస్తూ లవ్‌ సింబల్‌ ఎమోజీతో సల్మాన్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

ఇక, అల్లుఅర్జున్ (Allu Arjun) హీరోగా నటించిన ‘పుష్ప’ ఇండియన్‌ బాక్సాఫీస్‌ వద్ద బ్లాక్‌బస్టర్‌ హిట్‌ అందుకుంది. ఎర్రచందనం స్మగ్లింగ్‌ నేపథ్యంలో రూపుదిద్దుకున్న ఈ సినిమా కోసం సామ్‌ మొదటిసారి ఐటమ్‌ సాంగ్‌ చేశారు. ఇందులో ఆమె బన్నీతో కలిసి వేసిన స్టెప్పులు ఆకర్షించాయి. ప్రస్తుతం ‘శాకుంతలం’, ‘ఖుషి’ చిత్రాలతో ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధమవుతోన్న సామ్‌ త్వరలోనే సల్మాన్‌ఖాన్‌తో స్క్రీన్‌ షేర్‌ చేసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.



Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు