Samantha: అదృష్టంగా భావిస్తా.. నెటిజన్‌కు సామ్‌ కౌంటర్‌

నటుడు నాగచైతన్య నుంచి విడాకులు తీసుకున్న అనంతరం నటి సమంత నెట్టింట ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నారు. తన ప్రవర్తనను తప్పుబడుతూ పలువురు...

Published : 28 May 2022 02:29 IST

హైదరాబాద్‌: నాగచైతన్య నుంచి విడాకులు తీసుకున్న అనంతరం నటి సమంత నెట్టింట ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నారు. తన ప్రవర్తనను తప్పుబడుతూ సోషల్‌మీడియా వేదికగా వచ్చిన కామెంట్స్‌పై ఆమె వీలునంతవరకూ స్పందించారు. వారందరికీ తనదైన శైలిలో సమాధానమిచ్చారు. కాగా, తాజాగా తన ఇష్టాయిష్టాలను అవహేళన చేస్తూ ఓ నెటిజన్ పెట్టిన ట్వీట్‌పై సామ్‌ స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇచ్చారు. అసలేం జరిగిందంటే..

సమంతకు మూగజీవాలంటే ఎంతో ఇష్టం. గత కొంతకాలం నుంచి ఆమె రెండు కుక్కపిల్లల్ని పెంచుకుంటున్నారు. తన పెంపుడు శునకాలతో దిగిన పలు ఫొటోలను సైతం ఆమె సోషల్‌మీడియా వేదికగా ఎన్నోసార్లు అభిమానులతో పంచుకున్నారు. జిమ్‌లో వర్కౌట్లు పూర్తైన తర్వాత వాటితో కలిసి దిగిన ఓ ఫొటోని తాజాగా సామ్‌ షేర్‌ చేశారు. ఆ ఫొటోపై స్పందించిన ఓ నెటిజన్‌.. ‘‘ఆమె ఒంటరిగా ఆ శునకాలు, పిల్లులతోనే చనిపోయేలా ఉంది’’ అని కామెంట్‌ చేయడంతో దానిపై సామ్‌ స్పందిస్తూ.. ‘‘నన్ను నేను అదృష్టవంతురాలిగా భావిస్తున్నా’’ అని సమాధానం ఇచ్చారు. సామ్‌ సమాధానమిచ్చిన కొంతసేపటికే ఆ నెటిజన్‌.. తాను చేసిన ట్వీట్‌ని డిలీట్‌ చేశాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని