Samantha: సమంత ఆరోగ్యంపై మరోసారి రూమర్లు.. స్పందించిన టీమ్
సమంత ఆరోగ్యం క్షీణించిందంటూ మరోసారి కథనాలు వెలువడ్డాయి. దీనిపై నెట్టింట చర్చ జరగడంతో ఆమె టీమ్ స్పందించింది.
హైదరాబాద్: ప్రముఖ సినీ నటి సమంత (Samantha) ఆరోగ్యం విషమించిందంటూ వస్తోన్న వార్తలపై ఆమె వ్యక్తిగత టీమ్ స్పందించింది. ప్రస్తుతం ఆమె ఆరోగ్యంగానే ఉన్నారని స్పష్టంచేసింది. సామ్ ఆరోగ్యంపై వస్తోన్న వార్తలను ఖండిస్తూ అవాస్తవాలను ప్రచారం చేయొద్దని విజ్ఞప్తి చేసింది. తాను మయోసైటిస్ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్నట్టు సమంత ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. కొంచెం కష్టమైనా త్వరలోనే కోలుకుంటానని చెప్పారు. ఈ క్రమంలో తాజాగా ఆమె ఆరోగ్య పరిస్థితి విషమించిందని, చికిత్స కోసం విదేశాలకు వెళ్తున్నారంటూ పలు వెబ్సైట్లు, సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అయితే, తాజాగా సామ్ టీమ్ సమాధానంతో ఆ వదంతులకు చెక్ పడినట్టైంది. సమంత హెల్త్‌పై రూమర్లు రావడం ఇదే తొలిసారి కాదు. ‘సమంత ఆరోగ్యం బాలేదు.. ఆమె ఆస్పత్రిలో చేరారు’ అంటూ కొన్ని రోజుల క్రితం కూడా కథనాలు వచ్చాయి.
మయోసైటిస్ వ్యాధితో బాధపడుతూనే ‘యశోద’ సినిమాలోని తన పాత్రకు డబ్బింగ్ చెప్పారు సమంత. హరి- హరీశ్ సంయుక్తంగా తెరకెక్కించిన ఈ సినిమా నవంబరు 11న ప్రేక్షకుల ముందుకొచ్చింది. సమంత నటనకు ఎప్పటిలానే మంచి ఆదరణ దక్కింది. ప్రస్తుతం.. విజయ్ దేవరకొండ సరసన ‘ఖుషి’ అనే సినిమాలో సమంత నటిస్తున్నారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
IND vs NZ: చాహల్ విషయంలో హార్దిక్ నిర్ణయం సరైంది కాదు: గంభీర్
-
World News
Pakistan: మసీదులో బాంబు పేలుడు.. 28మంది మృతి, 150మందికి గాయాలు
-
General News
TS HighCourt: తొలగిన ప్రతిష్టంభన... గవర్నర్ ప్రసంగంతోనే బడ్జెట్ సమావేశాలు
-
Movies News
Social Look: సోలోగా సదా.. క్యూట్‌గా ఐశ్వర్య.. గులాబీలతో నభా!
-
World News
Imran Khan: ఒకే ఒక్కడు.. ఏకంగా 33 స్థానాల్లో ఇమ్రాన్ ఖాన్ పోటీ
-
India News
Rahul Gandhi: ‘ఆ సమయంలో కన్నీళ్లొచ్చాయి’.. గడ్డకట్టే మంచులోనూ రాహుల్ ప్రసంగం