Samantha: నన్నెంతగానో నమ్మినందుకు ఆయనకు ధన్యవాదాలు: సమంత

యశోద సక్సెస్‌పై ఆనందం వ్యక్తం చేశారు నటి సమంత. తమ చిత్రానికి విజయాన్ని అందించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు చెప్పారు.

Published : 19 Nov 2022 12:26 IST

హైదరాబాద్‌: ‘యశోద’పై (Yashoda) సినీ ప్రియులు చూపిస్తోన్న ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు చెప్పారు నటి సమంత (Samantha). సినిమా విజయంపై హర్షం వ్యక్తం చేసిన ఆమె ఓ ఎమోషనల్‌ నోట్‌ షేర్‌ చేశారు. ‘ఈ సినిమాపై మీరు కురిపిస్తోన్న ప్రేమ, ప్రశంసలు నాకెంతో విలువైన బహుమతులు. మీ ప్రేమాభిమానాలు పొందుతున్నందుకు ఆనందిస్తున్నా. థియేటర్లలో విజిల్స్‌, సందడి చూస్తుంటే ఈ సినిమా కోసం శ్రమించిన టీమ్‌కు సరైన విలువ దక్కిందనిపిస్తోంది. ప్రస్తుతం నేను మేఘాల్లో తేలిపోతున్నా. ఈ ప్రాజెక్ట్‌ విషయంలో నన్నెంతగానో నమ్మిన నిర్మాత కృష్ణ ప్రసాద్‌, దర్శకులు హరి-హరీశ్‌, ఇతర నటీనటులకు నా ధన్యవాదాలు’’ అని రాసుకొచ్చారు.

‘అద్దెగర్భం’ అంశంపై ‘యశోద’ తెరకెక్కింది. సమంత టైటిల్‌ రోల్‌లో కనిపించారు. వరలక్ష్మి శరత్‌కుమార్‌, ఉన్ని ముకుందన్‌ కీలకపాత్రలు పోషించారు. నవంబర్‌ 11న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద మంచి టాక్‌ అందుకుంది. సినిమాలో సామ్‌ నటన బాగుందని, ముఖ్యంగా యాక్షన్‌ సన్నివేశాల్లో ఆమె అదరగొట్టేసిందని సినీ ప్రియులు పేర్కొంటున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని