Samantha: నాగచైతన్యతో విడాకులు.. సామ్‌ అసలు విషయం చెప్పేసిందా?

వైవాహిక బంధానికి ముగింపు పలికిన నాటి నుంచి అటు నాగచైతన్య(Naga Chaitanya), ఇటు సమంత(Samantha) ఇరువురు ఈ విషయంపై ఎక్కడా స్పందించలేదు.

Published : 22 Jun 2022 01:04 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: వైవాహిక బంధానికి ముగింపు పలికిన నాటి నుంచి అటు నాగచైతన్య(Naga Chaitanya), ఇటు సమంత(Samantha) ఇరువురు ఈ విషయంపై ఎక్కడా స్పందించలేదు. తమ బంధానికి స్వస్తి పలికిన తొలినాళ్లలో సామ్‌ అన్యాపదేశంగా కొన్ని కొటేషన్లను పంచుకున్నారు తప్ప, వీరిద్దరూ విడిపోవటానికి గల కారణాలను మాత్రం చెప్పలేదు. తాజాగా ఈ విషయమై సమంత స్పందించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం తెలుగుతో పాటు, బాలీవుడ్‌ ప్రాజెక్టుల్లో నటిస్తున్న సమంత ‘కాఫీ విత్‌ కరణ్‌’ షోలో పాల్గొన్నారు.

సినిమా సెలబ్రిటీలతో కరణ్‌ జోహార్‌ చేసే ఇంటర్వ్యూలు చాలా ఫేమస్‌. తాజాగా సీజన్‌-7లో భాగంగా తొలిసారి సామ్‌ ఈ షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సినిమా కెరీర్‌తో పాటు, నాగచైతన్య బంధానికి ఎందుకు ముగింపు పలకాల్సి వచ్చిందో కూడా చెప్పినట్లు బాలీవుడ్‌ వర్గాల సమాచారం. డిస్నీ+హాట్‌స్టార్‌ వేదికగా జులై 7న ఈ ఎపిసోడ్‌ టెలికాస్ట్‌ కానుంది. ప్రస్తుతం సోషల్‌ మీడియాలో ఈ వార్తలు వైరల్‌ అవుతుండటంతో ఈ షో ఎప్పుడెప్పుడు చూద్దామా? అని ఇటు సామ్‌ అభిమానులతో పాటు అటు చైతూ ఫ్యాన్స్‌ సైతం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి సమంత చెప్పిన ముచ్చట్ల గురించి తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే!

విఘ్నేష్‌ శివన్‌ దర్శకత్వంలో వచ్చిన ‘కణ్మణి రాంబో ఖతీజా’ చిత్రంలో సమంత నటించింది.  ప్రస్తుతం ఆమె నటిస్తున్న సస్పెన్స్‌ థ్రిల్లర్‌ ‘యశోద’ ఆగస్టులో విడుదల కానుంది. దీంతో పాటు గుణశేఖర్‌ దర్శకత్వంలో రూపొందిన  ‘శాకుంతలం’ నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకొంటోంది. ఇది కాకుండా విజయ్‌ దేవరకొండతో ‘ఖుషి’ అనే సినిమాలో నటిస్తోంది సమంత. మరోవైపు నాగచైతన్య విక్రమ్‌ కె.కుమార్‌ దర్శకత్వంలో నటించిన ‘థ్యాంక్యూ’ విడుదలకు సిద్ధమైంది. ఆమీర్‌ఖాన్‌తో ‘లాల్‌ సింగ్‌ చద్దా’లోనూ చైతూ నటించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని