Samantha: ‘శాకుంతలం’ సినిమాకు నా మనసులో ఎప్పటికీ ప్రత్యేకమైన స్థానం ఉంటుంది: సమంత

‘శాకుంతలం’ సినిమా చూసినట్లు తెలుపుతూ సమంత (Samantha) ట్వీట్‌ చేసింది. సినిమా ఎంతో అందంగా ఉందని తెలిపింది. 

Published : 14 Mar 2023 14:21 IST

హైదరాబాద్‌: సమంత(Samantha) అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న సినిమా ‘శాకుంతలం’ (Shakuntalam). గుణశేఖర్‌ దర్శకత్వంలో సామ్‌ నటించిన ఈ సినిమాపై ఆమె ఫ్యాన్స్‌తో పాటు సినీ ప్రియులంతా ఆసక్తిగా ఉన్నారు. తాజాగా సమంత ఒక్క ట్వీట్‌తో అందరిలో జోష్‌ నింపింది. సినిమా చూశానని చెప్పిన సామ్‌ గుణశేఖర్‌కు ధన్యవాదాలు తెలిపింది.

‘‘ఇప్పుడే సినిమా చూశాను. గుణశేఖర్‌ గారు ఈ సినిమాను ఎంతో అందంగా తీర్చిదిద్దారు. ఒక గొప్ప ఇతిహాసానికి మనోహరంగా జీవం పోశారు. ఇందులోని భావోద్వేగాలు అందరికీ నచ్చుతాయి. చిన్న పిల్లలకు కూడా ఈ చిత్రం ఎంతో నచ్చుతుంది. ఈ సినిమాకు నా మనసులో ఎప్పటికీ ప్రత్యేకమైన స్థానం ఉంటుంది.  ఇంత మంచి చిత్రాన్ని ఆడియన్స్‌తో కలిసి చూడడం కోసం వెయిట్‌ చేస్తున్నాను’’ అని తెలుపుతూ చిత్ర నిర్మాతలకు కృతజ్ఞతలు చెప్పింది. కాళిదాసు రచించిన అభిజ్ఞాన శాకుంతలం ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించిన విషయం తెలిసిందే. శకుంతల, దుష్యంత మహారాజుల మధ్య ఉన్న ప్రేమ నేపథ్యంలో ఈ సినిమా సాగుతుంది. ఇందులో శకుంతల పాత్రను సమంత పోషించగా.. దుష్యంతుడి పాత్రలో దేవ్‌ మోహన్‌ నటించారు. మోహన్‌బాబు, మధుబాల, గౌతమి తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ట్రైలర్‌, పోస్టర్‌లకు మంచి ప్రేక్షకాదరణ వచ్చింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని