Samantha: ఎంతోకాలం తర్వాత గాయని చిన్మయి గురించి సమంత ట్వీట్
నటి సమంత (Samantha) - గాయని చిన్మయి (Chinmayi) ఎన్నో సంవత్సరాల నుంచి మంచి స్నేహితులుగా ఉన్నారనే విషయం తెలిసిందే. గత కొంతకాలంగా వీరిద్దరి మధ్య సరిగ్గా మాటల్లేవనే ప్రచారం సోషల్‌మీడియాలో జోరుగా జరుగుతోంది.
హైదరాబాద్: తన స్నేహితురాలు, గాయని చిన్మయి (Chinmayi) గురించి తాజాగా ట్వీట్ చేశారు నటి సమంత (Samantha). చిన్మయిని క్వీన్ అంటూ అభివర్ణించారు. ఎంతోకాలం తర్వాత సమంత - చిన్మయి మధ్య తాజాగా జరిగిన ఓ సంభాషణ ఇప్పుడు నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తోంది. ఇంతకీ వారిద్దరూ ఏం మాట్లాడుకున్నారంటే..
మయోసైటిస్ నుంచి కోలుకున్న సామ్.. తాజాగా ‘సిటాడెల్’ షూటింగ్ పనులు మొదలుపెట్టేశారు. తాము తెరకెక్కించనున్న సిరీస్‌లోకి సామ్‌కు స్వాగతం పలుకుతూ హాలీవుడ్ దర్శక ద్వయం రస్సో బ్రదర్స్ ఓ ట్వీట్ చేశారు. దీనిపై చిన్మయి భర్త రాహుల్ స్పందిస్తూ.. ‘‘సామ్ ప్రయాణం ఎలా మొదలైందో నాకింకా గుర్తుంది. హాలీవుడ్ ప్రముఖ దర్శకులు రస్సో బ్రదర్స్.. సామ్‌ను తమ ప్రాజెక్ట్‌లోకి ఆహ్వానించడం చూస్తుంటే ఎంతో గర్వంగా ఉంది’’ అని పేర్కొన్నారు. దీనిపై చిన్మయి స్పందిస్తూ ‘‘సమంత ఓ క్వీన్.. ఇదే నిదర్శనం’’ అని ప్రశంసించారు. దీనిపై సామ్ కామెంట్ చేస్తూ.. ‘‘నేను కాదు నువ్వే చిన్మయి. అలాగే రాహుల్ లాంటి మంచి స్నేహితుడు నాకు దొరకడం నిజంగా నా అదృష్టం’’ అని బదులిచ్చారు.
‘ఏం మాయ చేసావే’తో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు సమంత. అందులో ఆమె పోషించిన జెస్సీ పాత్రకు తన గాత్రంతో ప్రాణం పోశారు గాయని చిన్మయి. ఆనాటి నుంచి సామ్ నటించిన అన్ని పాత్రలకూ ఆమే డబ్బింగ్ చెప్పేవారు. దీంతో వీరిద్దరూ మంచి స్నేహితులయ్యారు. అయితే, ‘యూటర్న్’ నుంచి సామ్.. తెలుగులో తన పాత్రలకు తానే డబ్బింగ్ చెబుతోన్న విషయం తెలిసిందే. దీంతో సామ్-చిన్మయిల మధ్య సరిగ్గా మాటల్లేవని పలు వార్తలు వచ్చాయి. అవన్నీ అవాస్తవాలు మాత్రమేనని చిన్మయి ఇటీవల పలు ఇంటర్వ్యూల్లో చెప్పారు. తాజాగా వీరిద్దరి మాటలు సినీ ప్రియుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Sarus Crane: కొంగతో అనుబంధం.. కాపాడిన వ్యక్తిపై కేసు..!
-
Sports News
IPL 2023:చెన్నై సూపర్ కింగ్స్‌కు బిగ్ షాక్.. కీలక ఆటగాడు దూరం!
-
Movies News
SS Karthikeya: ‘RRR’ ఆస్కార్ క్యాంపెయిన్ ఖర్చు ఇదే.. విమర్శకులకు కార్తికేయ కౌంటర్!
-
Politics News
Madhyapradesh: 200కు పైగా సీట్లు గెలుస్తాం.. మళ్లీ అధికారం మాదే..: నడ్డా
-
India News
Fact Check: ₹239 ఉచిత రీఛార్జ్ పేరుతో వాట్సాప్‌లో నకిలీ మెసేజ్!
-
Sports News
Dinesh Karthik: టీమ్ఇండియాలో అతడే కీలక ప్లేయర్.. కోహ్లీ, రోహిత్‌కు నో ఛాన్స్