Samantha: ఆ మూవీ లొకేషన్‌లో సమంత.. ఫొటోలు వైరల్‌

ఓ మూవీ లొకేషన్‌లో నటి సమంత (Samantha) తాజాగా సందడి చేశారు. దీనికి సంబంధించిన పలు ఫొటోలను ఆమె ఇన్‌స్టా వేదికగా అభిమానులతో పంచుకున్నారు.

Published : 24 Sep 2023 13:55 IST

ఇంటర్నెట్‌డెస్‌: కెరీర్‌ నుంచి కాస్త విరామం తీసుకుని ప్రస్తుతం ట్రావెలింగ్‌పై దృష్టి పెట్టారు నటి సమంత (Samantha). చిన్నప్పటి నుంచి తాను చూడాలని కలలు కన్న అన్ని ప్రాంతాలను ఆమె ఇప్పుడు సరదాగా చుట్టేస్తున్నారు. ఇందులో భాగంగా తాజాగా ఆమె ఆస్ట్రియాలోని సాల్జ్‌బర్గ్ వెళ్లారు. అక్కడ తనకెంతో ఇష్టమైన లొకేషన్స్‌ను ఆమె సందర్శించారు. అక్కడి దిగిన ఫొటోలను ఇన్‌స్టా వేదికగా అభిమానులతో పంచుకున్నారు.

‘‘చిన్నతనంలో ఎప్పుడైనా ఎక్కువ ఆనందం లేదా బాధ కలిగినప్పుడల్లా ‘సౌండ్‌ ఆఫ్‌ మ్యూజిక్‌’ చిత్రాన్ని చూస్తూ ఉండేదాన్ని. ఈ ప్రపంచం నుంచి తప్పించుకునేదాన్ని. వాస్తవానికి దూరంగా ఒక అద్భుత ప్రపంచంలోకి అది నన్ను తీసుకువెళ్లేది. నా వరకూ ఇదొక ఆధ్యాత్మిక ప్రదేశం. సాధారణంగా ఒక చిత్రాన్ని మళ్లీ మళ్లీ చూస్తే దానిపై మన అభిప్రాయం మారుతూ ఉంటుంది. కానీ, ఈ చిత్రాన్ని ఎప్పుడు చూసినా నాకు ఒకే విధమైన భావన కలుగుతుంది. నా చిన్ననాటి రోజులను గుర్తుచేస్తూ ఉంటుంది. నేడు ఆ సినిమా లొకేషన్స్‌ను సందర్శించడం నన్నెంతో భావోద్వేగానికి గురి చేస్తోంది’’ అని ఆమె పేర్కొన్నారు.

Kushi Ott Release: ఓటీటీలోకి ‘ఖుషి’ చిత్రం.. స్ట్రీమింగ్‌ ఎక్కడంటే..?

సమంత కొంత కాలం నుంచి మయోసైటిస్‌తో ఇబ్బందిపడుతున్న విషయం తెలిసిందే. ఆటో ఇమ్యూనిటీ డిజార్డర్‌తో తాను బాధపడుతున్నానని ‘యశోద’ ప్రమోషన్స్‌ సమయంలో ఆమె ప్రకటించారు. ఈ క్రమంలోనే తన ప్రాజెక్ట్‌లన్నింటినీ ఆమె పూర్తి చేశారు. ‘సిటడెల్‌’ (ఇండియన్‌ వెర్షన్‌) షూట్‌ పూర్తైన వెంటనే వర్క్‌ లైఫ్‌ నుంచి బ్రేక్‌ తీసుకుంటున్నట్లు ప్రకటించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని