Samantha Fitness trainer: స‌మంత ఒకవేళ అథ్లెట్ అయితే విరాట్ కోహ్లీలా ఉండేది.. ఎందుకంటే..

టాలీవుడ్‌ నటి సమంత వ్యక్తిగతంగా, వృత్తిపరంగా ఎంత బిజీగా ఉన్నా.. క్రమం తప్పకుండా చేసే పనుల్లో ఒకటి వ్యాయామం. ఫిట్‌నెస్‌కు అత్యంత ప్రాధాన్యమిచ్చే సామ్‌... తాను చేసే జిమ్‌ వర్కవుట్స్‌కి సంబంధించిన వీడియోస్‌ను సోషల్‌మీడియాలో పంచుకుంటుంది.

Published : 04 Mar 2022 01:29 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: టాలీవుడ్‌ నటి సమంత వ్యక్తిగతంగా, వృత్తిపరంగా ఎంత బిజీగా ఉన్నా.. క్రమం తప్పకుండా చేసే పనుల్లో ఒకటి వ్యాయామం. ఫిట్‌నెస్‌కు అత్యంత ప్రాధాన్యమిచ్చే సామ్‌... తాను చేసే జిమ్‌ వర్కవుట్స్‌కి సంబంధించిన వీడియోలను సోషల్‌మీడియాలో పంచుకుంటుంది. గతంలో 100 కిలోల బరువున్న బార్బెల్‌ను సులువుగా ఎత్తి ఆశ్చర్యపరిచింది. స్క్వాట్స్, ఏరోబిక్స్, యోగా, జిమ్, వెయిట్ లిఫ్టింగ్.. ఇలాంటివన్నీ చేస్తూ అందం, ఆరోగ్యాన్ని కాపాడుకుంటుంది.

మరి సామ్‌ అంత ఫిట్‌గా ఉండటానికి ఒక కారణం జునైద్‌ షేఖ్‌. ఫిట్‌నెస్‌ వీడియోల్లోనూ తన ట్రైన‌ర్ జునైద్ షేఖ్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావిస్తుంది. తాజాగా జునైద్ ఓ ఇంటర్వ్యూలో సమంతకు ఫిట్‌నెస్‌ పై ఉన్న శ్రద్ధ గురించి ఇలా చెబుతూ.. ‘‘ స‌మంత ఒకవేళ అథ్లెట్ అయితే విరాట్ కోహ్లీలా ఉండేది. నేను ఎంత కష్టమైన వ్యాయామం చెప్పినా స‌మంత మరొకసారి చెయ్యి నేను ప్రయత్నిస్తా అంటుంది కానీ చెయ్యను అని ఎప్పుడూ చెప్పదు. సమంత చాలా దూకుడుగా ఉంటుంది. క‌ష్టమైన ప‌నులు చేయాల‌నుకుంటుంది. సమంతని చూసి నేను స్ఫూర్తి పొందుతాను.  ఏ రోజూ వర్కవుట్స్‌ అంటే నో చెప్పదు. ” అని వెల్లడించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని