Samantha: సెక్సీగా కనిపించడం అంత తేలిక కాదు.. సమంతపోస్ట్‌

పదకొండేళ్ల సినీ కెరీర్‌లో టాలీవుడ్‌ అగ్ర నటి సమంత ఐటమ్‌ సాంగ్‌లో కనిపించింది లేదు.

Published : 22 Dec 2021 01:27 IST

అలా కనిపించాలంటే ఎంతో కష్టపడాలి

ఇంటర్నెట్‌ డెస్క్‌: పదకొండేళ్ల సినీ కెరీర్‌లో నటి సమంత(Samantha) ఐటమ్‌ సాంగ్‌లో కనిపించింది లేదు. తొలిసారి ‘పుష్ప’లోని ఐటమ్‌ సాంగ్‌ ‘‘ఊ అంటావా మావ.. ఊఊ అంటావా!’’ అంటూ అల్లు అర్జున్‌ సరసన ఆడిపాడింది. ఈ పాట లిరికల్‌ వీడియోకి ఎంత స్పందన వచ్చిందో థియేటర్లలో సామ్‌ డ్యాన్స్‌కీ అంతే ఆదరణ లభిస్తోంది. తాజాగా ఈ పాట 100 మిలియన్‌ వ్యూస్‌(అన్ని భాషల్లో కలిపి) మార్క్‌ను చేరుకుంది. ఈ సందర్భంగా సమంత హర్షం వ్యక్తం చేసింది.

‘‘నా కెరీర్‌లో నేను మంచి, చెడు, ఫన్నీ, సీరియస్‌ పాత్రలు పోషించా. అలాగే ‘సామ్‌ జామ్‌’ చాట్‌ షోకి హోస్ట్‌గానూ చేశా. నేను చేసే ప్రతీ పనికి పూర్తి కష్టపడతా. కానీ, సెక్సీగా కనిపించటమంటే అంత తేలిక కాదు. దాని కోసం మరో లెవల్‌లో ఎంతో కష్టపడాలి. ‘ఊ అంటావా మావ.. ఊఊ అంటావా!’ పాటకు మీరు చూపిస్తున్న ప్రేమకు నా ధన్యవాదాలు’’ అంటూ ఇన్‌స్టాలో పోస్ట్‌ చేసింది. ఇక ఈ పాటకి సమంతే కాదు.. సింగర్‌ ఇంద్రావతి చౌహాన్‌ వాయిస్‌ సైతం హైలైట్‌గా నిలిచింది.  బాలీవుడ్‌ కొరియోగ్రాఫర్ గణేశ్‌ ఆచార్య నృత్యాలు సమకూర్చారు. దేవీ శ్రీ ప్రసాద్‌ సంగీతమందించగా.. చంద్రబోస్‌ సాహిత్యం అందించారు. దర్శకుడు సుకుమార్‌ ఈ సినిమాను తెరకెక్కించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని