Samantha: ఇకపై సమంత నివాసం అక్కడే!

వదంతులకు తెరదించుతూ మేము విడిపోతున్నాం అని ప్రకటించేసింది టాలీవుడ్‌ జంట నాగచైతన్య- సమంత. ఈ నేపథ్యంలో సమంత ఏ పోస్టు చేసినా అది నెట్టింట వైరల్‌ అవుతోంది.

Updated : 06 Oct 2021 13:05 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: వదంతులకు తెరదించుతూ మేము విడిపోతున్నాం అని ప్రకటించేసింది టాలీవుడ్‌ జంట నాగచైతన్య- సమంత. ఈ నేపథ్యంలో సమంత ఏ పోస్టు చేసినా అది నెట్టింట వైరల్‌ అవుతోంది. ఆమె నుంచి వచ్చే అప్‌డేట్స్‌ మీద చర్చలు జరుగుతున్నాయి. మరి ఇప్పుడు సమంత ఎక్కడ ఉండబోతుంది అనేది ఆసక్తికరంగా మారింది. గతంలో ముంబయికి మకాం మార్చేస్తుందని రూమర్స్‌ వినిపించినప్పటికీ.. ‘‘లేదు.. హైదరాబాద్‌ నా హోమ్‌టౌన్‌.. ఇప్పటికీ.. ఎప్పటికీ’’ అని సమంత స్పష్టం చేసింది. అయితే హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో ఓ ఫ్లాట్‌లో సమంత నివసించనున్నట్లు సమాచారం. ప్రస్తుతం సమంత ‘శాకుంతలం’, ‘కాతు వాకుల రెందు కాదల్‌’ చిత్రాల్లో నటిస్తుండగా.. చైతు ‘థాంక్యూ’, ‘లాల్‌ సింగ్‌ చద్దా’ ‘బంగార్రాజు’తో సందడి చేసేందుకు సిద్ధంగా ఉన్నాడు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని