Sammathame: ఓటీటీలోకి ‘సమ్మతమే’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
కిరణ్ అబ్బవరం, చాందినీ చౌదరి జంటగా తెరకెక్కిన చిత్రం ‘సమ్మతమే’. జూన్ 24 థియేటర్లలో విడుదలై, ప్రేక్షకుల్ని మెప్పించిన ఈ రొమాంటిక్ కామెడీ సినిమా త్వరలోనే ఓటీటీ సందడి చేయనుంది.
ఇంటర్నెట్ డెస్క్: కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram), చాందినీ చౌదరి (Chandini Chowdary) జంటగా తెరకెక్కిన చిత్రం ‘సమ్మతమే’ (Sammathame). జూన్ 24 థియేటర్లలో విడుదలై, ప్రేక్షకుల్ని మెప్పించిన ఈ రొమాంటిక్ కామెడీ త్వరలోనే ఓటీటీలో సందడి చేయనుంది. జులై 15 నుంచి ‘ఆహా’లో (Aha) స్ట్రీమింగ్‌కానుంది. ‘ఇప్పటి వరకూ కృష్ణుడి లీలలు, సత్యభామ అలక గురించే విన్నాం. అదే రోల్ రివర్స్ అయితే? ఎలా ఉంటుందో చూడండి’ అంటూ ‘ఆహా’.. ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించింది. పెళ్లికి ముందు తనకు నచ్చినట్టు బతికిన అమ్మాయి పెళ్లి తర్వాత భర్తకు నచ్చినట్టే ఉండాలనడం ఎంతవరకు సమంజసం? అనే కాన్సెప్ట్‌తో దర్శకుడు గోపీనాథ్ రెడ్డి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.
కథేంటంటే?
కృష్ణ (కిరణ్ అబ్బవరం) తన చిన్నతనంలోనే అమ్మను కోల్పోతాడు. అమ్మ ప్రేమను భార్యలో చూసుకోవాలనుకుంటాడు. దాంతో చిన్నప్పటి నుంచే పెళ్లిని ఓ లక్ష్యంగా పెట్టుకుంటాడు. ప్రేమించిన తర్వాత పెళ్లి కాకుండా పెళ్లాడాక ప్రేమ అనే ఆలోచనతో పెరుగుతాడు. అలాంటి కృష్ణకు ఓ సందర్భంలో శాన్వి (చాందినీ చౌదరి) పరిచయమవుతుంది. తాను కోరుకున్న లక్షణాలేవీ లేని శాన్వితో కృష్ణ ప్రయాణం ఎలా సాగుతుంది? పెళ్లికి ముందు ప్రేమించను అని నిర్ణయించుకున్న కృష్ణ ప్రేమలో ఎలా పడ్డాడు? చివరకు తన జీవితం ఎలాంటి మలుపు తిరుగుతుంది? శాన్వి, కృష్ణల ప్రయాణం ఎలా ముగుస్తుంది? అనేది మిగతా కథ.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (01/10/2023)
-
Intresting News: ఈరోజు ఆసక్తికర వార్తలు మిస్సయ్యారా?.. అయితే ఇవి మీకోసమే..
-
Road Accident: టూరిస్టు బస్సు బోల్తా.. 8 మంది మృతి
-
Gangula: తెలంగాణలో రేషన్ డీలర్లకు కమీషన్ పెంపు: మంత్రి గంగుల
-
Manipur: అల్లర్లతో అట్టుడికిన మణిపుర్లో.. ఉగ్ర కలకలం
-
Lokesh: పవన్ సభకు ప్రభుత్వం ఆటంకం కలిగించే అవకాశం: లోకేశ్