Samyuktha Menon: ధనుష్‌తో గొడవ.. వివరాలు బయటపెట్టిన సంయుక్తా మేనన్‌

కోలీవుడ్‌ స్టార్‌ హీరో ధనుష్‌తో (Dhanush) తనకు గొడవలు ఏర్పాడ్డాయంటూ జరుగుతోన్న ప్రచారంపై పెదవి విప్పారు నటి సంయుక్తా మేనన్‌ (Samyuktha Menon). ప్రస్తుతం ‘సార్‌’ (SIR) సినిమా కోస....

Published : 28 Jul 2022 13:21 IST

హైదరాబాద్‌: కోలీవుడ్‌ స్టార్‌ హీరో ధనుష్‌తో (Dhanush) తనకు గొడవలున్నాయంటూ జరుగుతోన్న ప్రచారంపై పెదవి విప్పారు నటి సంయుక్తా మేనన్‌ (Samyuktha Menon). ప్రస్తుతం ‘సార్‌’ (SIR) సినిమా కోసం ధనుష్‌తో కలిసి పనిచేస్తోన్న ఆమె తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. సోషల్‌ మీడియాలో తన గురించి జరుగుతోన్న ప్రచారాలన్నీ అవాస్తవాలేనని అన్నారు. ‘‘నాకు ధనుష్‌తో ఎటువంటి విభేదాల్లేవు. మా మధ్య ఎప్పుడూ వాగ్వాదాలు చోటుచేసుకోలేదు. ఆయనతో నాకు మంచి రిలేషన్‌షిప్‌ ఉంది. ధనుష్‌తో నాకు గొడవలయ్యాయంటూ కావాలనే కొందరు సోషల్‌మీడియాలో ఇలాంటి వార్తలు సృష్టించారు. ‘సార్‌’ టీమ్‌కి నేను 21 రోజుల కాల్షీటు ఇచ్చా. దానికి అనుగుణంగానే వర్క్‌ చేస్తున్నా. ఒక పాట చిత్రీకరణ మినహా నా రోల్‌కు సంబంధించి షూట్‌ పూర్తైంది’’ అని సంయుక్తా మేనన్‌ తెలిపారు. అనంతరం మహేశ్‌బాబు-త్రివిక్రమ్‌ కాంబోలో రానున్న SSMB 28లో తాను నటించడం లేదని సంయుక్త వెల్లడించారు. SSMB28లో తానూ ఓ హీరోయిన్‌గా కనిపించనున్నారంటూ జరుగుతోన్న ప్రచారానికి చెక్‌ పెట్టారు.

పవన్‌కల్యాణ్‌ నటించిన ‘భీమ్లానాయక్‌’తో (Bheemla Nayak) మలయాళీ నటి సంయుక్తా మేనన్‌ తెలుగు తెరకు పరిచయమయ్యారు. అందులో ఆమె రానాకు జోడీగా కనిపించి నటనపరంగా అందరి ప్రశంసలు అందుకొన్నారు. ఆ సినిమా సక్సెస్‌ తర్వాత ఆమెకు తెలుగులో అవకాశాలు వరుస కట్టాయి. ఇందులో భాగంగానే ధనుష్‌ నటిస్తోన్న ‘సార్‌’లో ఆమెకు ఛాన్స్‌ లభించింది. వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా చిత్రీకరణలో ధనుష్‌తో సంయుక్తకు వాగ్వాదం చోటుచేసుకొందని, దాంతో ఆమె సెట్‌ నుంచి వెళ్లిపోయిందని ఇటీవల ప్రచారం జరిగింది. ఆ వార్తలపైనే తాజాగా సంయుక్త స్పందించి.. ‘సార్‌’కు సంబంధించిన వివరాలు బయటపెట్టారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని