Updated : 04 Aug 2022 10:53 IST

Samyuktha Menon: సంయుక్తా.. ఆరోజు తారక్‌తో ఏం మాట్లాడారు?

నెటిజన్‌ ప్రశ్నకు నటి సమాధానమేమిటంటే

హైదరాబాద్‌: ‘భీమ్లానాయక్‌’తో తెలుగు తెరకు పరిచయమైన మలయాళీ నటి సంయుక్తా మేనన్‌(Samyuktha Menon). తొలి సినిమాతోనే మంచి మార్కులు కొట్టేసిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం తెలుగులో వరుస ప్రాజెక్టులు చేస్తున్నారు. ఆమె కథానాయికగా నటించిన ‘బింబిసార’ చిత్రం శుక్రవారం విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఆమె ట్విటర్‌ వేదికగా తాజాగా ముచ్చటించారు. నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు సమాధానాలిచ్చారు.

మీ ఫోన్‌ వాల్‌ పిక్‌ ఏమిటి?

సంయుక్తా మేనన్‌: ఇదే నా వాల్‌ పిక్‌.. నాకెంతో ఇష్టమైన ‘నోవా’ని మీ అందరికీ పరిచయం చేస్తున్నా.

ధనుష్‌ గురించి మీ అభిప్రాయం ఏమిటి?

సంయుక్తా మేనన్‌: క్లాస్‌, మంచి వ్యక్తిత్వం గల మనిషి.

‘సార్‌’ రిలీజ్‌ ఎప్పుడు?

సంయుక్తా మేనన్‌: సార్‌.. తుఫాన్‌ త్వరలోనే మీ ముందుకు రానుంది. మీ అందరికీ టీజర్‌ నచ్చిందనే అనుకుంటున్నా.

ఈ ఫొటోలో మీరు తారక్‌తో ఏం చెబుతున్నారు?

సంయుక్తా మేనన్‌: ఆయన నటనా ప్రావీణ్యం గురించి మాట్లాడుతున్నా..! మరి, ఒకవేళ తారక్‌ మీ ముందుంటే మొదట మీరేం మాట్లాడతారు?

ఇంత తక్కువ సమయంలో తెలుగు ఎలా నేర్చుకోగలిగారు? ‘బింబిసార’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో మీరు చక్కగా మాట్లాడారు..!

సంయుక్తా మేనన్‌: హైదరాబాద్‌ నీకు రెండో నివాసమైనప్పుడు ఇక్కడి భాషను నువ్వు త్వరగా నేర్చుకోలేవా? లాక్‌డౌన్‌ సమయంలో జూమ్‌ క్లాసులు తీసుకొని మరీ నాకు తెలుగు నేర్పించిన ఆశా మేడమ్‌కు ధన్యవాదాలు.

మీ చిన్ననాటి ఫొటోని షేర్‌ చేయగలరు?

పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌ గురించి ఒక్కమాటలో చెప్పగలరు?

సంయుక్తా మేనన్‌: ఒక్కమాటలో ఆయన గురించి చెప్పడం చాలా కష్టం. ఎందుకంటే ఆయన ఓ అద్భుతం.

ఈ మధ్య కాలంలో మీరు ఎక్కువగా వింటోన్న పాటలు?

సంయుక్తా మేనన్‌: నీతో ఉంటే చాలు (బింబిసార), రారా రెడ్డి ఐ యామ్‌ రెడీ(మాచర్ల నియోజకవర్గం)

‘బింబిసార’ స్క్రిప్ట్‌ వినగానే మీ రియాక్షన్‌ ఏమిటి?

సంయుక్తా మేనన్‌: మంచి అవకాశం దొరికింది.

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ఎన్నిసార్లు చూశారు?

సంయుక్తా మేనన్‌: రెండుసార్లు

మహేశ్‌ గురించి ఒక్క మాటలో చెప్పమంటే..

సంయుక్తా మేనన్‌: ఎప్పటికీ ప్రకాశించే రాక్‌స్టార్‌ ఆయన.



Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని