Samyuktha: తెలుగులో నటించడం మొదలుపెట్టాకే కెరీర్ మలుపు తిరిగింది: సంయుక్త
తొలి సినిమాతోనే తన నటనతో గుర్తింపు తెచ్చుకుంది హీరోయిన్ సంయుక్త (Samyuktha). త్వరలోనే ‘సార్’(Sir) మూవీతో పలకరించడానికి సిద్ధమైంది.
Samyuktha: వెంకీ అట్లూరి (Venky Atluri) దర్శకత్వంలో ధనుష్ (Dhanush), సంయుక్త (Samyuktha) ప్రధానపాత్రల్లో తెరకెక్కుతోన్న సినిమా ‘సార్’(Sir). ఈ చిత్రం ఈ శుక్రవారం(ఫిబ్రవరి 17) ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగు-తమిళ భాషల్లో రిలీజ్ కానున్న ఈ చిత్ర ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ లభించింది. ప్రస్తుతం చిత్రబృందం ప్రమోషన్స్‌పై దృష్టిపెట్టింది. అందులో భాగంగా నటి సంయుక్త ఈ సినిమా విశేషాలను మీడియాతో పంచుకున్నారు.
తెలుగు ఎప్పుడు నేర్చుకున్నారు?
సంయుక్త: ఏ భాషలో నటిస్తున్నామో అది వస్తే బాగుంటుందని నేను భావిస్తాను. తెలుగుపై ఆసక్తితో ట్యూటర్‌ని పెట్టుకొని 15క్లాసుల్లో నేర్చేసుకున్నా. ఆ నోట్స్ నా దగ్గర ఇప్పటికీ ఉంది. సెట్‌లో తెలుగులో మాట్లాడితే అందరూ చాలా ఆనందించారు. ఇప్పుడు నేను తెలుగమ్మాయిని.
‘సార్’ సినిమాలోని పాత్ర కోసం ఏదైనా కసరత్తు చేస్తారా?
సంయుక్త: ‘భీమ్లానాయక్’ (Bheemla Nayak) సినిమా అప్పుడు ఈ స్టోరీ విన్నాను. వినగానే చాలా ఆసక్తిగా అనిపించింది. వెంటనే ఓకే చేశాను. సినిమాలోని పాత్ర కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నాను. పల్లెటూరి వాతావరణంలో నటించాలంటే నిజంగా అలాంటి ప్రదేశాలకు వెళ్లి వస్తాను. ‘సార్’లో టీచర్ పాత్రలో నటించడానికి కొంతమంది టీచర్లను కలిసి వాళ్లతో మాట్లాడాను. వాళ్ల కట్టు బొట్టు, హావభావాలు అన్ని గమనించాను. అలా చేస్తే పాత్రలో నటించడం సులభం అవుతుందని నేను అనుకుంటాను.
ధనుష్‌తో నటించడం ఎలా అనిపించింది?ఈ సినిమాలో మీ పాత్ర గురించి చెప్పండి.
సంయుక్త: ధనుష్ చాలా మంచి నటుడు. ఎన్నో భాషల్లో నటించాడు. నేను ఆయన అభిమానిని. ఎప్పుడూ ఒకేలా ఉంటారు. ఏదైనా సినిమాలో నటించేటప్పుడు కథకు ప్రాధాన్యం ఇస్తాను. అందులో నా పాత్ర ఎలాంటిది అని చూస్తాను. ‘సార్’ సినిమాలో నా పాత్ర చాలా కీలకమైంది. ‘బయాలజీ’ టీచర్‌గా కనిపిస్తాను. సాధారణంగా కొన్ని సినిమాల్లో ఫీమేల్ క్యారెక్టర్స్‌కు తక్కువ నిడివి ఇస్తుంటారు. కానీ ఈ సినిమాలో ప్రతి సన్నివేశంలో నా పాత్ర ప్రభావం కనిపిస్తూనే ఉంటుంది. నా పాత్రకు ఎమోషనల్ సీన్స్ ఎక్కువ.
నటనలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు?
సంయుక్త: వినడం. దర్శకుడు ఏం చెబుతున్నారని ఒకటికి రెండుసార్లు అడిగి తెలుసుకుంటాను. సినిమా షూటింగ్ జరుగుతున్నంతసేపు నా పాత్ర గురించే ఆలోచిస్తూ ఉంటాను. ఈ సినిమాలో రెండు భాషల్లో డైలాగులు చెప్పడానికి కొంచెం కష్టపడ్డాను. ఆ విషయంలో ధనుష్ సాయం చేశారు.
7 సంవత్సరాల సినీ కెరీర్ ఎలా ఉంది?
సంయుక్త: 2016లో మొదటిసారి నటించాను. మొదటి సినిమా చేస్తున్నప్పుడు సినిమా రంగాన్ని కెరీర్‌గా ఎంచుకోవాలని అనుకోలేదు. సరదాగా చేశాను. ఆ తర్వాత చదువుపై శ్రద్ధ పెట్టాను. మళ్లీ సినిమాలపై ఆసక్తి పెరిగింది. ఒక్క మంచి సినిమాలో అయినా నటించాలని కోరుకున్నా. నేను సినిమా రంగాన్ని దైవంగా భావిస్తాను. తెలుగులో నటించడం మొదలుపెట్టాక నా కెరీర్ మలుపు తిరిగింది.
భవిషత్తులో మీరు లేడీ ఓరియంటెడ్ సినిమాల్లో నటించే అవకాశం ఉందా?
సంయుక్త: లేడీ సూపర్ స్టార్ అనేది చాలా పెద్ద మాట(నవ్వుతూ). నటనను నిరూపించుకునే ఎలాంటి పాత్రలైనా చేస్తాను. కచ్చితంగా ఇలాంటివే ఉండాలి అని అనుకోను. ప్రేక్షకులకు వినోదాన్నివ్వడం ముఖ్యం.
దర్శకుడు వెంకీ అట్లూరి (Venky Atluri) గురించి చెప్పండి?
సంయుక్త: వెంకీ అట్లూరి (Venky Atluri)తో కలిసి పనిచేయడం చాలా సులభంగా అనిపిస్తుంది. ప్రతి సన్నివేశాన్ని వివరంగా చెబుతారు. తనకేం కావాలో క్లారిటీగా ఉంటారు. సెట్లో చాలా సరదాగా ఉంటారు. ఇంతకు ముందు నేను నటించిన సినిమాలకు నేనే డబ్బింగ్ చెప్పాను. కానీ ఈ సినిమాకు సమయాభావం కారణంగా చెప్పలేకపోయాను. సినిమా నాకు ఎన్నో మంచి జ్ఞాపకాలను ఇచ్చింది. ప్రత్యేకించి క్లైమాక్స్ షూట్ నాకు నచ్చింది.
మీ అప్‌కమింగ్ మూవీస్ గురించి ఏమైనా అప్‌డేట్ ఇస్తారా?
సంయుక్త: ప్రస్తుతం ‘విరూపాక్ష’ సినిమా షూటింగ్ జరుగుతోంది. ‘బింబిసార 2’ కు సంబంధించిన పనులు మొదలుపెట్టారు. దాని గురించి త్వరలోనే చెబుతాను.
ప్రేమపై మీ అభిప్రాయం ఏంటి.
సంయుక్త: విశ్వంలో ప్రతిదీ ప్రేమతో నిండి ఉంది. ఈ మధ్య కాలంలో ప్రేమ అంటే కేవలం రొమాన్స్ అనుకుంటున్నారు. కానీ అది తప్పు. ఎప్పటికైనా నన్ను గౌరవించే వ్యక్తినే పెళ్లి చేసుకుంటాను.
మీ పేరులో నుంచి మేనన్ ఎందుకు తొలగించారు?
సంయుక్త: ఈ విషయంపై చాలాసార్లు మాట్లాడాను. నటికి ఉండాల్సిన బాధ్యతలు గ్రహించిన తర్వాత ఇంటిపేరును కొనసాగించకూడదని నిర్ణయించుకున్నా. మన ఇంటిపేరును చూసి మనకు గుర్తింపు ఇవ్వకూడదని నేను అనుకుంటాను. అందుకే మేనన్‌ని తొలగించాను.
మీరు సమంతలా ఉన్నారని ఎవరైనా అన్నారా?
సంయుక్త: సమంత చాలా ధైర్యవంతురాలు, గొప్పనటి. నాలో సమంత పోలికలు ఉన్నాయని కొంతమంది అన్నారు. నా నటన చూసి సమంతలా చేస్తున్నావని ఎవరైనా అంటే నేను ఇంకా సంతోషిస్తాను.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Dhamki: ‘ధమ్కీ’కి బదులు ఆ సినిమా వేసిన థియేటర్ సిబ్బంది.. ప్రేక్షకులు షాక్
-
Politics News
Kishan Reddy: ఈ ఏడాది దేశానికి, తెలంగాణకు కీలకం: కిషన్‌రెడ్డి
-
Crime News
TSPSC: టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్.. లావాదేవీలపై సిట్ ఆరా
-
Sports News
IND vs AUS : ‘రోహిత్-కోహ్లీ’ మరో రెండు పరుగులు చేస్తే.. ప్రపంచ రికార్డే
-
Politics News
KTR: మన దగ్గరా అలాగే సమాధానం ఇవ్వాలేమో?: కేటీఆర్
-
Movies News
Ugadi: ఉగాది జోష్ పెంచిన బాలయ్య.. కొత్త సినిమా పోస్టర్లతో టాలీవుడ్లో సందడి..