బావిలో దూకడానికి వెళుతున్నా.. 

అతని పేరు పింకీ.. ఆమె పేరు సందీప్‌. వాళ్ల పేర్ల వెనుక ఉన్న రహస్యం ఏంటి..? వాళ్లిద్దరి మధ్య సంబంధం ఏంటి.? అసలు వాళ్లిద్దరూ కలిసి భారత్‌-పాకిస్థాన్‌ బార్డర్‌ దాటాలని నిర్ణయించుకోవడానికి దారి తీసిన కారణాలేంటి..? అనే ఆసక్తికరమైన కథాంశంతో తెరకెక్కిన చిత్రం ‘సందీప్‌ ఔర్‌ పింకీ ఫరార్‌’.

Published : 09 Mar 2021 16:32 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: అతడి పేరు పింకీ.. ఆమె పేరు సందీప్‌. వాళ్ల పేర్ల వెనుక ఉన్న రహస్యం ఏంటి..? వాళ్లిద్దరి మధ్య సంబంధం ఏంటి.? అసలు వాళ్లిద్దరూ కలిసి భారత్‌-పాకిస్థాన్‌ సరహద్దు దాటాలని నిర్ణయించుకోవడానికి దారి తీసిన కారణాలేంటి..? అనే ఆసక్తికరమైన కథాంశంతో తెరకెక్కిన చిత్రం ‘సందీప్‌ ఔర్‌ పింకీ ఫరార్‌’. అర్జున్‌ కపూర్‌, పరిణీతి చోప్రా జంటగా నటించారు. దివాకర్‌ బెనర్జీ దర్శకత్వంలో తెరకెక్కించడంతో పాటు స్వయంగా నిర్మించారు. అను మాలిక్‌ సంగీతం అందిస్తున్నారు. ఈ క్రైమ్‌ థ్రిల్లర్‌ మార్చి 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా.. చిత్రబృందం ట్రైలర్‌ను విడుదల చేసింది.

‘‘రైల్వే స్టేషన్‌లో కూర్చున్న హీరోను.. ‘ఎక్కడికి వెళుతున్నారు అని అడుగుతుంది హీరోయిన్‌. ‘బావిలో దూకడానికి వెళుతున్నా.. నువ్వు కూడా వస్తావా..?’ అంటూ హీరో బదులివ్వడంతో ట్రైలర్‌ మొదలవుతుంది. నువ్వు ఎవరి జీవితంలోనైనా సమస్యగా మారితే అక్కడి నుంచి బయటికి రావాలంటూ హీరో-హీరోయిన్‌ మధ్య సాగే సంభాషణతో ట్రైలర్‌ ఆసక్తికరంగా ఉంది. మీరూ చూసేయండి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని