Updated : 25 Feb 2022 09:42 IST

BheemlaNayak: ‘ఈ ధరలతో థియేటర్‌ నడపలేం’: ఏపీలో థియేటర్‌ ముందు నోటీసు

మైలవరం: ఆంధ్రప్రదేశ్‌లో సినిమా టికెట్ల వ్యవహారం ఇంకా కొలిక్కి రాలేదు. అతి తక్కువ ధరలతో థియేటర్లు నడపడం తమకు కష్టంగా ఉందని ఇప్పటికే పలు యాజమాన్యాలు సినిమాహాళ్లను స్వచ్ఛందంగా మూసివేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే పవన్‌కల్యాణ్‌ కథానాయకుడిగా నటించిన ‘భీమ్లానాయక్‌’ విడుదలని దృష్టిలో ఉంచుకునైనా టికెట్‌ ధరల్లో రాష్ట్ర ప్రభుత్వం తగిన మార్పులు చేస్తుందని భావించిన వారందరికీ మరోసారి నిరాశే ఎదురైంది.

ఈ క్రమంలోనే శుక్రవారం ఉదయం కృష్ణా జిల్లా మైలవరంలోని సంఘమిత్ర థియేటర్ యాజమాన్యం ‘భీమ్లానాయక్‌’ ప్రదర్శన నిలిపివేస్తున్నట్లు బోర్డు పెట్టింది. ‘‘తగ్గించిన టికెట్‌ ధరలతో సినిమా హాళ్లను నడపడం కష్టం. దాన్ని దృష్టిలో ఉంచుకొనే ‘భీమ్లానాయక్‌’ సినిమా ప్రదర్శన నిలిపివేయడమైంది. గమనించగలరు’’ అని గేటు బయట నోటీసు అతికించడంతో సినిమా చూసేందుకు థియేటర్‌కు వచ్చిన పలువురు అభిమానులు నిరాశకు గురయ్యారు.


 

Read latest Movies News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని