Sanjana: మగబిడ్డకు జన్మనిచ్చిన నటి సంజన

నటి సంజనా గల్రానీ శుభవార్త చెప్పారు. తాను పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చినట్లు  సోషల్‌మీడియా వేదికగా తెలియజేశారు. దీంతో ఆమెకు అభిమానులు అభినందనలు చెబుతున్నారు...

Published : 20 May 2022 13:21 IST

హైదరాబాద్‌: నటి సంజనా గల్రానీ శుభవార్త చెప్పారు. తాను పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చినట్లు  సోషల్‌మీడియా వేదికగా తెలియజేశారు. దీంతో ఆమెకు అభిమానులు అభినందనలు చెబుతున్నారు. ‘సోగ్గాడు’ చిత్రంతో నటిగా వెండితెరకు పరిచయమైన ఈ బెంగళూరు సుందరి హీరోయిన్‌గానే కాకుండా సహాయనటిగానూ నటించి తెలుగు, తమిళ, కన్నడ ప్రేక్షకుల్ని మెప్పించారు. ‘బుజ్జిగాడు’, ‘ముగ్గురు’, ‘యమహో యమః’, ‘లవ్‌ యూ బంగారం’, ‘సర్దార్‌ గబ్బర్‌సింగ్‌’, ‘2 కంట్రీస్‌’.. వంటి తెలుగు చిత్రాల్లో నటించారు. నటిగా రాణిస్తోన్న తరుణంలోనే ఆమె 2020లో బెంగళూరుకు చెందిన అజీజ్‌ పాషా అనే వైద్యుడిని వివాహం చేసుకున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని