ఆస్పత్రిలో సంజన రచ్చ రచ్చ

కన్నడతోపాటు తెలుగు చిత్ర పరిశ్రమలోనూ గుర్తింపు పొందిన నటి సంజనా గల్రానీ ఆసుపత్రిలో రచ్చరచ్చ చేశారు. డోప్ పరీక్షలు చేయించుకోనంటూ వైద్యులకు సహకరించలేదు. చందనసీమలో మాదకద్రవ్యాల వినియోగం, సరఫరా ఆరోపణలపై కన్నడ నటీమణులు రాగిణి ద్వివేది, సంజన అరెస్టు అయిన సంగతి తెలిసిందే. బెంగళూరు కేంద్ర నేర నియంత్రణ ....

Updated : 11 Sep 2020 18:30 IST

‘నన్ను బకరాని చేశారు’ అంటూ వాదన

బెంగళూరు: కన్నడతో పాటు తెలుగు చిత్ర పరిశ్రమలోనూ గుర్తింపు పొందిన నటి సంజనా గల్రానీ ఆస్పత్రిలో రచ్చ రచ్చ చేశారు. డోప్ పరీక్షలు చేయించుకోనంటూ వైద్యులకు సహకరించలేదు. కన్నడ చిత్ర పరిశ్రమలో మాదకద్రవ్యాల వినియోగం, సరఫరా ఆరోపణలపై నటీమణులు రాగిణి ద్వివేది, సంజన అరెస్టు అయిన సంగతి తెలిసిందే. బెంగళూరు కేంద్ర నేర నియంత్రణ దళం (సీసీబీ) విచారణ జరుపుతోంది. వీరిద్దరి వ్యవహారం అనేక మలుపులు తిరుగుతుండటంతో రాష్ట్రమంతా ఉత్కంఠ నెలకొంది.

అధికారులు మొదట రాగిణిని అదుపులోకి తీసుకున్నారు, ఆపై సంజనను కూడా అరెస్టు చేశారు. వీరిని కస్టడీలోకి తీసుకుని సీసీబీ విచారిస్తోంది. ఈ క్రమంలో డ్రగ్‌ టెస్ట్‌ కోసం సంజనను బెంగళూరులోని కేసీ సాధారణ ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే అక్కడ ఆమె హంగామా చేశారు. డోప్‌ పరీక్ష చేయించుకోనంటూ వైద్యులకు సహకరించకుండా, పోలీసులతో వాదనకు దిగారు. ‘నన్నెందుకు అరెస్టు చేశారు? మీరంతా కలిసి నన్ను బకరాను చేశారు. నేనెలాంటి తప్పూ చేయలేదు. నన్నెందుకు అరెస్టు చేశారనే విషయం ఇప్పటికీ నాకు అర్థం కావడం లేదు’ అని కేకలు పెట్టారు.

మరోపక్క ఈ కేసు విచారణలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) అధికారులు రంగ ప్రవేశించారు. ఇప్పటికే పోలీసుల విచారణలో ఉన్న రాగిణి ద్వివేదీ, సంజనా గల్రానీ, పృథ్వీ శెట్టితో పాటు మాదకద్రవ్య సరఫరాదారులు వీరేన్‌ ఖన్నా, రాహుల్‌ ఆస్తుల గురించి వీరు ఆరా తీశారు. వారికి ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నట్లు ఈడీ అధికారులు గుర్తించారు. వీటికి తోడు ఈ కేసులో అరెస్ట్‌ అయిన నిందితులకు కేరళకు చెందిన బంగారు స్మగ్లర్‌ ముఠాతో సంబంధాలున్నట్లు గుర్తించిన ఈడీ అధికారులు విచారణ కొనసాగించేందుకు కొచ్చి ప్రత్యేక కోర్టు నుంచి అనుమతి కూడా పొందారు. ఇకపై సీబీబీ, ఈడీ అధికారులు ఏకకాలంలో నిందితుల్ని విచారించనున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని