Sanjay Dutt: దక్షిణాది సినిమాల్లో నటించాలని ఉంది...: సంజయ్‌ దత్‌

ధ్రువ సర్జా నటించిన కేడీ సినిమా టీజర్‌ విడుదల సందర్భంగా బాలీవుడ్‌ నటుడు సంజయ్‌ దత్‌ దక్షిణాది సినిమాలపై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన సౌత్ సినిమాలో నటించాలని ఉందని తెలిపారు. 

Published : 21 Oct 2022 12:36 IST

ఇంటర్నెట్‌ డెస్క్: ధ్రువ్‌ సర్జా హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘కేడీ’. ‘ది డెవిల్‌’ అనేది ఉపశీర్షిక. ఈ సినిమా టీజర్‌ హిందీ వర్షన్‌కు బాలీవుడ్‌ ప్రముఖ హీరో సంజయ్‌ దత్‌ తన గాత్రాన్ని అందించారు.  ఈ చిత్ర టీజర్‌ను ఇటీవల విడుదల చేశారు. ఈ సందర్భంగా సంజయ్‌దత్‌ మాట్లాడుతూ సౌత్ సినిమాలపై తనకున్న ప్రేమను తెలిపారు. ‘‘నాకు దర్శకుడు రాజమౌళి మంచి మిత్రుడు. ఇటీవల విడుదలైన కేజీఎఫ్‌-2 సినిమాలో నటించడం చాలా ఆనందంగా ఉంది. సినిమాలపై ఉన్న ప్రేమంతా వారు తీసే చిత్రాల్లో కనిపిస్తుంటుంది. హీరో యశ్‌తో కలిసి పనిచేయడం ఎంతో సంతోషాన్నిచ్చింది. ఇప్పుడు ధ్రువ్‌ సర్జాతో నటించేందుకు ఎదురుచూస్తున్నా. ఇంకా మరెన్నో దక్షిణాది సినిమాల్లో నటించాలని ఉంది’’ అని అన్నారు.

ఇటీవల ‘కేజీఎఫ్‌-2’ లో అధీరాగా అలరించిన సంజయ్‌ దత్‌ ‘కేడీ’లోనూ ఓ కీలకపాత్రలో నటించనున్నారు. మాస్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు ప్రేమ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. 1970లో బెంగళూరులో జరిగిన యథార్థ సంఘటనల ఆధారంగా ఈ చిత్రం రూపొందిస్తున్నారు. అర్జున్‌ జన్య సంగీతం అందిస్తున్న ఈ సినిమా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ప్రేక్షకులను అలరించనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని