Oscars: ఆస్కార్‌కు అలియా సినిమా..!

సినీ ప్రపంచంలో ప్రతిష్ఠాత్మకంగా భావించే ‘ఆస్కార్‌’ (Oscar) వేదికపై ఈసారి భారతదేశం నుంచి పోటీ..

Updated : 28 Aug 2022 13:01 IST

బీటౌన్‌లో కొత్త ప్రచారం.. బ్యూటీని మెచ్చుకుంటూ పోస్టులు

ముంబయి: సినీ ప్రపంచంలో ప్రతిష్ఠాత్మకంగా భావించే ‘ఆస్కార్‌’ (Oscar) వేదికపై ఈసారి భారతదేశం నుంచి పోటీ గట్టిగానే ఉండనున్నట్లు తెలుస్తోంది. రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్‌ఆర్‌ఆర్’ (RRR) ఈ ఏడాది ఆస్కార్‌ బరికి నామినేట్‌ అయ్యే అవకాశం ఉందని ప్రముఖ హాలీవుడ్‌ మ్యాగజైన్‌ వెరైటీ జోస్యం చెప్పగా.. ఇప్పుడు, మరో బీటౌన్‌ సినిమా పేరూ వినిపిస్తోంది. అలియా భట్‌ ప్రధాన పాత్రలో నటించిన ఓ సినిమా ఈసారి ఆస్కార్‌ రేసులో ఉండే అవకాశం ఉందని బాలీవుడ్‌ మీడియా కోడైకూస్తోంది. ఇంతకీ ఆ సినిమా ఏమిటి? దాని విశేషాలేమిటి?

ముంబయి మాఫియా క్వీన్‌ గంగూబాయి జీవితాన్ని ఆధారంగా చేసుకుని తెరకెక్కిన చిత్రం ‘గంగూబాయి కతియావాడి’ (Gangubai Kathiawadi). గంగూబాయిగా అలియా నటించారు. సంజయ్‌ లీలా భన్సాలీ దర్శకత్వం వహించిన ఈ సినిమా 2022 ఆరంభంలో విడుదలై మంచి టాక్‌ అందుకుంది. అలియా నటనకు సినీ విమర్శకులు సైతం ఫిదా అయ్యారు. విదేశాల్లోనూ ఈ సినిమా మంచి వసూళ్లు రాబట్టింది. ఇక, బెర్లిన్‌ ఫిల్మ్ ఫెస్టివల్‌లో దీన్ని ప్రదర్శించగా ప్రేక్షకులందరూ కరతాళధ్వనులతో ప్రశంసించారు. ఈ నేపథ్యంలోనే ‘గంగూబాయి కతియావాడి’ ఆస్కార్‌కు వెళ్లే అవకాశం ఉందంటూ బాలీవుడ్‌ మీడియాలో తాజాగా వార్తలు వస్తున్నాయి. అలియా నటన, విదేశాల్లో సినిమాకు లభించిన గుర్తింపు.. ఇలాంటి అంశాలు అందుకు దోహదపడుతున్నాయని ఆయా కథనాల్లోని సమాచారం. ఈ వార్తలు చూసిన అలియా అభిమానులు ఆమెను మెచ్చుకుంటూ పోస్టులు పెడుతున్నారు. ఇక, సంజయ్‌ లీలా భన్సాలీ రూపొందించిన ‘దేవదాస్‌’ గతంలో ఆస్కార్‌కు నామినేట్‌ అయిన విషయం తెలిసిందే.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని