Alia Bhatt: అలియాపై రణ్‌బీర్‌ ఫిర్యాదు.. ప్రెస్‌మీట్‌లో చెప్పిన దర్శకుడు

బాలీవుడ్‌ ముద్దుగుమ్మ అలియాభట్‌, నటుడు రణ్‌బీర్‌ కపూర్‌ ఎంతోకాలం నుంచి ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం వీరిద్దరూ ఒకే ఇంట్లో నివాసం ఉంటున్నట్లు సమాచారం. కాగా, కొంతకాలం నుంచి అలియా...

Updated : 18 Feb 2022 10:07 IST

ముంబయి: బాలీవుడ్‌ ముద్దుగుమ్మ అలియా భట్‌, నటుడు రణ్‌బీర్‌ కపూర్‌ ఎంతోకాలం నుంచి ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం వీరిద్దరూ ఒకే ఇంట్లో నివాసం ఉంటున్నట్లు సమాచారం. కాగా, కొంతకాలం నుంచి అలియా భట్‌పై ప్రముఖ దర్శకుడు సంజయ్‌ లీలా భన్సాలీకి రణ్‌బీర్‌ ఫిర్యాదులు చేస్తున్నారట. ఈ విషయాన్ని తాజాగా దర్శకుడు భన్సాలీ ఓ ప్రెస్‌మీట్‌లో బయటపెట్టారు. ఇంతకీ అలియాపై రణ్‌బీర్‌ ఫిర్యాదులు చేయడానికి కారణమేంటంటే..

ముంబయి మాఫియా క్వీన్‌ గంగూబాయి జీవితాన్ని ఆధారంగా చేసుకుని సంజయ్‌ లీలా భన్సాలీ ‘గంగూబాయి కతియావాడీ’ తెరకెక్కించిన విషయం తెలిసిందే. ఫిబ్రవరి 25న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ప్రెస్‌మీట్‌లో పాల్గొన్న దర్శకుడు.. అలియాపై ప్రశంసల వర్షం కురిపించారు. ఈ సినిమాలో అలియా బాగా నటించిందని.. సినిమా చూశాక అందరూ ఆమెని మెచ్చుకుంటారని ఆయన అన్నారు. ‘‘గంగూబాయి పాత్రలో అలియా ఎంతగానో ఒదిగిపోయింది. ఒదిగిపోయింది అనడం కంటే ఆమె ఆ పాత్రలో జీవించేసింది అనడం ఉత్తమం. నాకు తెలిసినంత వరకూ నిజ జీవితంలోనూ ఆమె.. ఎక్కువ శాతం అలియాలా కాకుండా గంగూబాయిలానే ప్రవర్తిస్తుందట. ఇంట్లో కూడా గంగూబాయిలానే మాట్లాడుతుందని చాలా సార్లు ఆమె ప్రియుడు నాకు ఫిర్యాదు చేశాడు. ఏదైనా ఒక పాత్రలో పూర్తిగా లీనమైనప్పుడే ఇలాంటి జరుగుతుంటాయి’’ అని సంజయ్‌ తెలిపారు. దర్శకుడి మాటలకు పక్కనే ఉన్న అలియా చిరునవ్వులు చిందించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని