విజయ్‌కు జోడీగా మరో బీటౌన్‌ బ్యూటీ

టాలీవుడ్‌ రౌడీ విజయ్‌ దేవరకొండకు క్రేజ్‌ మామూలుగా లేదు. కేవలం తెలుగులోనే కాకుండా బాలీవుడ్‌ హీరోయిన్స్‌ సైతం ఆయనతో కలిసి నటించేందుకు ఎంతో ఆసక్తికనబరుస్తున్నారు...

Published : 11 Mar 2021 16:15 IST

ఫొటో వైరల్‌..

హైదరాబాద్‌: టాలీవుడ్‌ రౌడీ విజయ్‌ దేవరకొండకు క్రేజ్‌ మామూలుగా లేదు. కేవలం తెలుగులోనే కాకుండా బాలీవుడ్‌ హీరోయిన్స్‌ సైతం ఆయనతో కలిసి నటించేందుకు ఎంతో ఆసక్తికనబరుస్తున్నారు. ‘లైగర్‌’ కోసం ఇప్పటికే బాలీవుడ్‌ భామ అనన్యాపాండేతో ఆడిపాడుతున్న విజయ్‌.. త్వరలోనే మరో బీటౌన్‌ బ్యూటీతో స్క్రీన్‌పై రొమాన్స్‌ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇంతకీ ఎవరా కథానాయిక అంటే సారా అలీఖాన్‌.

‘లైగర్‌’ షూట్‌లో భాగంగా విజయ్‌దేవరకొండ ఎక్కువ సమయం ముంబయిలోనే గడుపుతున్నారు. షూట్‌ కోసం గత కొన్నిరోజుల క్రితం ముంబయికి వెళ్లిన విజయ్‌.. ప్రముఖ సెలబ్రిటీ డిజైనర్‌ మనీశ్‌ మల్హోత్ర ఏర్పాటు చేసిన పార్టీలో పాల్గొన్నారు. ఇందులో భాగంగా నటి సారాఅలీఖాన్‌తో కలిసి ఆయన ఫొటోలకు పోజులిచ్చారు. అప్పట్లో ఆ ఫొటోలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి. ఈ క్రమంలోనే విజయ్‌-సారా కలిసి ఓ దక్షిణాది చిత్రంలో నటించే అవకాశముందంటూ తాజాగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. టాలీవుడ్‌కు చెందిన ఓ ప్రముఖ నిర్మాత వీరిద్దరితో కలిసి సినిమా రూపొందించేందుకు ఎంతో ఆసక్తితో ఉన్నట్లు సమాచారం. అయితే, ఈ వార్తలపై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు