Sara Ali Khan: పరాజయాలూ.. పాఠాలు నేర్పిస్తాయి

పరాజయాలు సైతం ఒక్కోసారి మంచి పాఠాలు నేర్పుతాయంటోంది బాలీవుడ్‌ ముద్దుగుమ్మ సారా అలీఖాన్‌. తన మూడో చిత్రం ‘లవ్‌ ఆజ్‌కల్‌’ ఆశించినంతగా విజయం సాధించకపోవడంపై ఓ ఇంటర్వ్యూలో స్పందించింది.

Published : 24 Jun 2024 01:07 IST

రాజయాలు సైతం ఒక్కోసారి మంచి పాఠాలు నేర్పుతాయంటోంది బాలీవుడ్‌ ముద్దుగుమ్మ సారా అలీఖాన్‌. తన మూడో చిత్రం ‘లవ్‌ ఆజ్‌కల్‌’ ఆశించినంతగా విజయం సాధించకపోవడంపై ఓ ఇంటర్వ్యూలో స్పందించింది. ‘నా సినీ కెరీర్‌ అప్పుడప్పుడే మొదలైంది. మొదటి రెండు చిత్రాలు విజయం సాధించినా.. మూడోది పరాజయం పాలైంది. ఆ సినిమా ఫ్లాప్‌ కావడానికి నేనూ ఓ కారణం. అందులో నేను చేసిన జో పాత్రను అంచనా వేయడంలో పొరపాటు చేశానేమోనని అనిపిస్తుంటుంది. కొన్నిరకాల ఒత్తిళ్లు, కొందరి సలహాతో ఆ పాత్ర ఒప్పుకోవాల్సి వచ్చింది. సినిమా విడుదలైన తర్వాత నా పాత్రపై ఎన్నోరకాల ట్రోల్స్‌ వచ్చాయి. మనసుకు నచ్చిందే చేయాలి.. ఎవరి మాటా వినొద్దు అని నాకు అప్పుడు అర్థమైంది. మన పని ఇతరులకు నచ్చనప్పుడు అంతా మనల్నే వేలెత్తి చూపిస్తారు. భారమంతా మనపైనే పడుతుంది. ఈ చిత్ర విషయంలోనూ అదే జరిగిందేమో’ అంటూ ఆనాటి అనుభవాలను గుర్తు చేసుకుంది. సారా ప్రస్తుతం ‘మెట్రో ఇన్‌ దినో’, ‘స్కై ఫోర్స్‌’, ‘ఈగల్‌’ సినిమా చిత్రీకరణలతో బిజీగా ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని