Sara Ali Khan: వెండితెరను మిస్‌ అవుతున్నా... కానీ!

‘థియేట్రికల్‌ సినిమాలను మిస్‌ అవుతున్నాను’ అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది బాలీవుడ్‌ కథానాయిక సారా అలీ ఖాన్‌ (Sara Ali Khan).

Updated : 24 Mar 2023 06:59 IST

‘థియేట్రికల్‌ సినిమాలను మిస్‌ అవుతున్నాను’ అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది బాలీవుడ్‌ కథానాయిక సారా అలీ ఖాన్‌ (Sara Ali Khan). ఆమె నటించిన ‘కూలీ నెం.1’, ‘అత్రంగీ రే’ చిత్రాలు వరుసగా ఓటీటీ ద్వారానే ప్రేక్షకుల ముందుకొచ్చాయి. ప్రస్తుతం సారా నటిస్తున్న చిత్రం ‘గ్యాస్‌లైట్‌’ కూడా నేరుగా ఓటీటీ బాటే పట్టింది. దీని గురించి ఆమె మాట్లాడుతూ.. ‘నేను కొన్నేళ్లుగా వెండితెరను మిస్‌ అవుతున్నాను. నా సినిమాలు వరసగా ఓటీటీలోనే విడుదలైనా కానీ, ‘అత్రంగీ రే’ని హాట్‌స్టార్‌లో విడుదల చేసినప్పుడు ప్రేక్షకుల నుంచి ప్రశంసలు అందుకున్నాను. సినిమా కథ, అందులో మీ నటన నిజాయతీగా ఉంటే అది ప్రేక్షకుల మనసును తాకుందని నేను తెలుసుకున్నాను. థియేటర్‌లో విడుదలయ్యే సినిమాల కోసం నేను నటిగా మారాను. త్వరలో నా సినిమాలు థియేటర్‌లో విడుదలవుతాయని అనుకుంటున్నాను. దీని కోసం నేను ఎదురు చూస్తున్నాను. ‘గ్యాస్‌లైట్‌’ విడుదల నిర్ణయం నాది కాదు. బహుశా ఈ సినిమా కంటెంట్‌ ఓటీటీకి సరిపోయేలా ఉండటంతోనే నిర్మాత ఈ నిర్ణయం తీసుకొని ఉంటార’ని చెప్పింది సారా.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని