Bollywood: ఈ హీరోయిన్‌ మహా పొదుపరి.. రూ.400ల కోసం హాట్‌స్పాట్‌ అడిగింది..

బాలీవుడ్‌ హీరోయిన్‌ సారా అలీఖాన్‌ (Sara Alikhan)కు సంబంధించిన ఓ ఆసక్తికర విషయం వైరలవుతోంది. తన తాజా చిత్రం ప్రమోషన్‌లో భాగంగా ఆమె ఈ విషయాన్ని పంచుకుంది.

Published : 02 Jun 2023 15:21 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: సాధారణంగా నటీనటులు విలాసవంతమైన జీవితాన్ని గడుపుతుంటారని.. ఖర్చు విషయంలో వెనకాడరని కొందరు అనుకుంటారు. కానీ బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ సారా అలీఖాన్‌ (Sara Alikhan) చేసిన పని తెలిస్తే మాత్రం ఆశ్చర్యపోతారు. సైఫ్‌ అలీఖాన్‌ (Saif Ali Khan) కుమార్తెగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ అమ్మడు కొన్నిరోజుల్లోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా ఈ హీరోయిన్‌ తన గురించి పంచుకున్న కొన్ని విశేషాలు ఆసక్తికరంగా ఉన్నాయి.

సారా ఇటీవల విదేశాలకు వెళ్లింది. అక్కడ రోమింగ్‌ కోసం రూ.400 చెల్లించాలని హోటల్‌ మేనేజ్‌మెంట్‌ వాళ్లు అడగారట. దీంతో ఆమె ఒక్కరోజు రోమింగ్‌ కోసం అంత చెల్లించాలా.. అని తన మేకప్‌మ్యాన్‌ను హాట్‌స్పాట్‌ ఆన్‌ చేయాలని కోరిందట. అంతేకాదు అక్కడ ఉన్న తోటి నటీనటులను మీరంతా డబ్బు చెల్లించారా అని అడిగితే.. వాళ్లు రూ.3000 పెట్టి నెలరోజులకు ప్యాకెజ్‌ తీసుకున్నామని చెప్పడంతో ఆమె అవాక్కయిందట. ఈ విషయాన్ని స్వయంగా ఆమె ఓ వీడియోలో పంచుకుంది. తన దృష్టిలో డబ్బును పొదుపు చేస్తే రెట్టింపు సంపాదించినట్లే అని చెప్పింది. ఈ వీడియో చూసిన వారంతా ఆమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు. 

ఇక బాలీవుడ్‌ హీరో విక్కీ కౌశల్‌ (Vicky Kaushal) ఓ సినిమా ప్రమోషన్‌లో సారా గురించి మాట్లాడుతూ ఆమె డబ్బుకు ఎంతో విలువ ఇస్తుందని చెప్పాడు. తనే కాదు తన కుటుంబసభ్యులు కూడా అనవసరంగా ఖర్చు చేస్తే ఆమెకు నచ్చదని అన్నాడు. వీరిద్దరూ కలిసి నటించిన ‘జరహట్ కే జరబచ్ కే’. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా వీళ్లు వరుస ఇంటర్వ్యూలు ఇచ్చారు. అలాగే కపిల్ శర్మ షోకు కూడా వెళ్లి సందడి చేశారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని