Saranga Dariya​: నాలుగు నెలలు.. 25కోట్లు

సాయిపల్లవి ‘సారంగ దరియా..’ పాట యూట్యూబ్‌లో 25 కోట్ల వ్యూస్‌తో ఇంకా జోరు కొనసాగిస్తోంది.

Published : 22 Jun 2021 15:10 IST

హైదరాబాద్‌: సాయిపల్లవి ‘సారంగ దరియా..’ పాట యూట్యూబ్‌లో రికార్డులు బద్దలు కొడుతోంది. నెట్టింట విడుదలైన నెల రోజుల్లోనే 10కోట్ల వీక్షణలు దక్కించుకొని రికార్డు సృష్టించిన ఈ గీతం.. అతి తక్కువ కాలంలోనే 20కోట్లకు పైగా వ్యూస్‌ సాధించింది. ఇప్పుడు ఏకంగా 25 కోట్ల వ్యూస్‌తో ఇంకా జోరు కొనసాగిస్తోంది. సినిమా విడుదలకు ముందే వ్యూస్‌తో రికార్డులు సృష్టించిన అతి తక్కువ సినిమా పాటల్లో ‘సారంగ దరియా’ ఒకటి.

నాగచైతన్య, సాయిపల్లవి జంటగా శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘లవ్‌స్టోరీ’. పవన్‌ సి.హెచ్‌ స్వరాలందించారు. రచయిత సుద్దాల అశోక్‌ తేజ సాహిత్యంతో కొత్త సొబగులద్దుకున్న ఈ తెలంగాణ జానపదాన్ని.. మంగ్లీ ఆలపించిన తీరు, దానికి హుషారెత్తించేలా సాయి పల్లవి కాలు కదిపిన విధానం పాటను ప్రత్యేకంగా నిలబెట్టాయి. అందుకే ఈ పాటకు యూట్యూబ్‌లో ఇంతటి ఆదరణ దక్కుతోంది. తెలంగాణ నేపథ్యంలో సాగే ఓ విభిన్నమైన ప్రేమ కథతో ఈ చిత్రం రూపొందింది. కరోనాతో వాయిదా పడిన ఈ సినిమాను త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని