
Published : 08 Dec 2021 01:35 IST
Sarath Babu: శరత్‌బాబు గురించి ఆసక్తికర విశేషాలు.. ‘వెండితెర వేల్పులు’
ఇంటర్నెట్‌డెస్క్: శరత్కాల చంద్రుడిలా సమ్మోహనుడు.. సగటు చిత్రాల కథానాయకుడు.. విలక్షణత, విశిష్టతల కలబోసిన నటుడు.. ఆయనే ఆమదాలవలస అందగాడు శరత్‌బాబు. తెలుగు, తమిళ భాషల్లో కథానాయకుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా తనదైన ముద్రవేశారు. ‘రామ రాజ్యం’ చిత్రంతో వెండితెరకు పరిచమైన ఆయన దాదాపు 200లకు పైగా చిత్రాల్లో నటించి మెప్పించారు. శరత్‌బాబు నటించిన సినిమాలు, అందులోని పాత్రలే కాకుండా మరిన్ని ఆసక్తికర విశేషాలతో మీ ముందుకు వస్తోంది ఈ వారం ‘వెండితెర వేల్పులు’. ఈటీవీ వార్తా ఛానెళ్లలో ఆదివారం ఉదయం 10.30గంటలకు, సాయంత్రం 6.30లకు ప్రసారం కానుంది.
Tags :