Sardar: ‘సర్దార్‌’ టీజర్‌ అదరహో.. విభిన్న లుక్స్‌లో కార్తి!

తమిళ నటుడు కార్తి కథానాయకుడిగా పి. ఎస్‌. మిత్రన్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘సర్దార్‌’ .

Updated : 29 Sep 2022 22:16 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: తమిళ నటుడు కార్తి (Karthi) కథానాయకుడిగా పి.ఎస్‌. మిత్రన్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘సర్దార్‌’ (Sardar). రాశీఖన్నా కథానాయిక. రజీషా విజయన్‌, చుంకీ పాండే కీలక పాత్రధారులు. ఈ సినిమా దీపావళికి ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా గురువారం టీజర్‌ విడుదలైంది. ఇండియన్‌ మిలటరీ నేపథ్యంలో ఈ సినిమా రూపొందినట్టు టీజర్‌ చూస్తే అర్థమవుతోంది. కార్తి పలు విభిన్న లుక్స్‌లో కనిపించి, సినిమాపై ఆసక్తిని పెంచేలా ఉన్నారు. కంటెంట్‌కు తగ్గట్టు జి.వి. ప్రకాశ్‌ కుమార్‌ అందించిన నేపథ్య సంగీతం టీజర్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ సినిమాని తెలుగు రాష్ట్రాల్లో అన్నపూర్ణ స్టూడియోస్‌ సంస్థ విడుదల చేస్తోంది. అతి త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించనున్నారు.


Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts