Sardar: ‘సర్దార్‌’ ట్రైలర్‌ వచ్చేసింది.. విభిన్న గెటప్పుల్లో ఆసక్తి రేకెత్తిస్తోన్న కార్తి

కార్తి హీరోగా నటించిన ‘సర్దార్‌’ సినిమా ట్రైలర్‌ విడుదలైంది. పి. ఎస్‌. మిత్రన్‌ దర్శకత్వం వహించిన సినిమా ఇది.

Published : 14 Oct 2022 20:10 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: తమిళ నటుడు కార్తి (Karthi) కథానాయకుడిగా పి.ఎస్‌. మిత్రన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సర్దార్‌’ (Sardar). రాశీఖన్నా, రజీషా విజయన్‌ కథానాయికలు. చంకీ పాండే కీలక పాత్ర పోషించారు. ఈ సినిమా దీపావళి కానుకగా ఈ నెల 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా శుక్రవారం ట్రైలర్‌ విడుదలైంది. ఇండియన్‌ మిలటరీ ఇంటిలిజెన్స్‌ నేపథ్యంలో ఈ సినిమా రూపొందినట్టు ట్రైలర్‌ చూస్తే అర్థమవుతోంది. కార్తి పలు విభిన్న లుక్స్‌లో కనిపించి, సినిమాపై ఆసక్తిని పెంచేలా ఉన్నారు. జి.వి. ప్రకాశ్‌ కుమార్‌ అందించిన నేపథ్య సంగీతం టీజర్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మరి, ‘సర్దార్‌’ ఎవరు? పలు రూపాల్లో కనిపించటానికి కారణమేంటి? తెలియాలంటే సినిమా చూడాల్సిందే.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని