Mahesh Babu: దిస్‌ ఈజ్‌ మహేశ్‌ రిపోర్టింగ్‌ సర్‌.. ‘సర్కారు వారి..’ ట్రైలర్‌ అదరహో..!

‘సర్కారు వారి పాట’ ట్రైలర్‌ వచ్చేసింది. మహేశ్‌బాబు లుక్స్‌, డైలాగ్స్‌ అభిమానులకు ఉర్రూతలూగించేలా ఉన్నాయి.

Updated : 02 May 2022 16:20 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: మహేశ్‌బాబు మునుపెన్నడూ కనిపించిన లుక్‌లో అలరించబోతున్నాడనే సమాచారం తెలిసినప్పటి నుంచే ‘సర్కారు వారి పాట’పై ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది. ఇప్పటికే విడుదలైన టీజర్‌, పాటలు సినిమాపై భారీ అంచనాలు పెంచాయి. ఆ అంచనాలను పెంచేలా తీర్చిదిద్దిన ట్రైలర్‌ను చిత్ర బృందం తాజాగా విడుదల చేసింది. మహేశ్‌ క్లాస్‌ అండ్‌ మాస్‌ లుక్స్‌, ఆయన చెప్పిన డైలాగ్స్‌ అభిమానులను హుషారెత్తించేలా ఉన్నాయి. ఈ ప్రచార చిత్రంలో చూపించిన సన్నివేశాల్ని బట్టి యాక్షన్‌, కామెడీ, లవ్‌.. ఇలా అన్ని రకాల ఎమోషన్స్‌తో సినిమా రూపొందినట్టు తెలుస్తోంది.

బ్యాంకు కుంభకోణం తదితర అంశాలతో యాక్షన్‌ నేపథ్యంలో ఈ సినిమాని పరశురామ్‌ తెరకెక్కించారు. మహేశ్‌ సరసన కీర్తి సురేశ్‌ నటించింది. వెన్నెల కిశోర్‌, సుబ్బరాజు తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాని నవీన్‌ యెర్నేని, వై. రవిశంకర్‌, రామ్‌ ఆచంట, గోపీచంద్‌ ఆచంట సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం: తమన్‌, కూర్పు: మార్తాండ్‌ కె. వెంకటేశ్‌, ఛాయాగ్రహణం: ఆర్‌. మధి. ఈ క్రేజీ ప్రాజెక్టు మే 12న విడుదలకానుంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని