SVP: ఎక్కడ పడితే అక్కడ ఫ్యాన్స్‌ ఉంటారమ్మా.. ‘సర్కారు వారి..’ కొత్త ట్రైలర్‌ చూశారా!

మహేశ్‌బాబు నటించిన ‘సర్కారు వారి పాట’ బాక్సాఫీసు వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా కర్నూలులో విజయోత్సవ వేడుకను నిర్వహించిన చిత్ర బృందం మరో ట్రైలర్‌ను విడుదల చేసింది.

Published : 17 May 2022 01:40 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: మహేశ్‌బాబు(Mahesh babu)నటించిన ‘సర్కారు వారి పాట’(Sarkaru vaari paata) బాక్సాఫీసు వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా సోమవారం కర్నూలులో విజయోత్సవ వేడుకను నిర్వహించిన చిత్ర బృందం కొత్త ట్రైలర్‌ను విడుదల చేసింది. ‘సమ్మర్‌ సెన్సేషనల్‌ బ్లాక్‌ బ్లస్టర్‌’ పేరుతో రిలీజ్‌ చేసిన ఈ వీడియోలోని మహేశ్‌బాబు హావభావాలు, సంభాషణలు అభిమానులను ఉర్రూతలూగించేలా ఉన్నాయి. వెన్నెల కిశోర్‌, కీర్తి సురేశ్‌, సుబ్బరాజు, సముద్రఖనితో మహేశ్‌ చేసిన హంగామా ఇందులో చూడొచ్చు. టైటిల్‌ ర్యాప్‌ సాంగ్‌ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మించిన ఈ సినిమాకు తమన్‌ అందించిన సంగీతం ప్రేక్షకుల్ని ఓ రేంజ్‌లో అలరించింది. ఆలస్యమెందుకు సర్కారు వారి నయా ప్రచార చిత్రాన్ని చూసేయండి...


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని