Sarkaru Vaari Paata: పైరసీకి పాల్పడుతుంటే తెలియజేయండి.. ‘సర్కారు..’ టీమ్‌ విజ్ఞప్తి

మహేశ్‌బాబు హీరోగా పరశురామ్‌ తెరకెక్కించిన చిత్రం ‘సర్కారు వారి పాట’. యాక్షన్‌-కామెడీ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా  గురువారం విడుదలకానుంది.

Published : 11 May 2022 22:41 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: మహేశ్‌బాబు(Mahesh babu) హీరోగా పరశురామ్‌ తెరకెక్కించిన చిత్రం ‘సర్కారు వారి పాట’(Sarkaru vaari paata). యాక్షన్‌- కామెడీ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా గురువారం విడుదలకానుంది. ఈ నేపథ్యంలో పైరసీని ప్రోత్సహించొద్దంటూ చిత్ర బృందం ప్రేక్షకులకు విజ్ఞప్తి చేసింది. సినిమాకు సంబంధించి ఎలాంటి ఫొటోలు, వీడియోలను ఫోన్లలో చిత్రీకరించి నెట్టింట పోస్ట్‌ చేయొద్దని కోరింది. ఎక్కడైనా ఎవరైనా పైరసీకి పాల్పడుతున్నట్టు తెలిస్తే 89786 50014, 99124 25159, 88811 08888 నంబర్లుకు వాట్సాప్‌, antipiracysolutions.org వెబ్‌సెట్‌ ద్వారా సమాచారం ఇవ్వొచ్చని పేర్కొంది. మహేశ్‌ విభిన్న లుక్‌లో నటించడం, ‘గీత గోవిందం’ హిట్‌ తర్వాత పరశురామ్ దర్శకత్వం వహించిన సినిమా కావడంతో ‘సర్కారు..’పై సినీ అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. వారి ఎదురుచూపులకు మరికొన్ని గంటల్లోనే తెరపడనుంది. ఈ క్రేజీ ప్రాజెక్టులో మహేశ్‌ సరసన కీర్తి సురేశ్‌(Keerthy suresh) సందడి చేయనుంది. ఈ సినిమాకు తమన్‌ అందించిన సంగీతం ఇప్పటికే మారుమోగింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు