Dancing Rose: ‘సార్పట్ట’లో ఆర్య తర్వాత ఈ క్యారెక్టరే హైలైట్..
Dancing Rose పాత్ర సందడి చేసేది, 16 నిమిషాలే అయినా సినిమా మొత్తం గుర్తుండిపోతుంది.
ఇంటర్నెట్‌డెస్క్: ఏ సినిమాలోనైనా కథానాయకుడు/నాయిక/విలన్ ఈ పాత్రలకు ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. కానీ, కొన్ని పాత్రలు నిడివి తక్కువైనా, కనిపించేది కొద్దిసేపే అయినా ఆ సినిమాపై విపరీతమైన ప్రభావాన్ని చూపుతాయి. ఇటీవల వచ్చిన ‘ఫ్యామిలీమ్యాన్-2’లో చెల్లమ్ సర్ పాత్ర ఎంతలా ట్రెండ్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పుడు పా.రంజిత్ దర్శకత్వంలో ఆర్య నటించిన పీరియాడికల్ స్పోర్ట్స్ డ్రామా ‘సార్పట్ట’లో ఓ పాత్ర అందరినీ విశేషంగా అలరిస్తోంది. అదే డ్యాన్సింగ్ రోజ్. ఈ పాత్రను తమిళ నటుడు షబ్బీర్ కల్లరాక్కళ్ పోషించారు. తెరపై ఆ పాత్ర సందడి చేసేది, 16 నిమిషాలే అయినా సినిమా మొత్తం గుర్తుండిపోతుంది. రింగ్‌లో కాళ్లతో చకచకా కదులుతుండే ఈ పాత్ర ఎంతగానో ఆకట్టుకుంది.
అసలెవరీ డ్యాన్సింగ్ రోజ్?
చెన్నైకు చెందిన నటుడు, థియేటర్ ఆర్టిస్ట్ షబ్బీర్ కల్లరాక్కళ్. 2014లో వచ్చిన ‘నీరుంగి వా ముత్తమిడితే’లో తొలిసారి వెండితెరపై కనిపించారు. అప్పటి నుంచి సహాయ పాత్రలు చేస్తూ మెప్పిస్తున్నారు. ‘అండగ మరు’, ‘పేట’, ‘టెడ్డీ’ తదితర చిత్రాల్లో నటించారు. అంతేకాదండోయ్ షబ్బీర్ 2009 నుంచి థియేటర్ ఆర్టిస్ట్‌గా కొనసాగుతున్నారు. ఆయనకు మార్షల్ ఆర్ట్స్‌లో ప్రవేశం ఉంది. పర్కోర్ క్రీడ(ఒక చోటు నుంచి మరొక చోటుకు వేగంగా కదలడం)లో ఆయన దిట్ట. 2019లో ‘సార్పట్ట’ నటీనటులను ఎంపిక చేసే కార్యక్రమం మొదలు పెట్టారు. క్యాస్ట్ డైరెక్టర్ నిత్య సూచనల మేరకు చిత్ర బృందం షబ్బీర్‌కు ఈ అవకాశం ఇచ్చింది. షూటింగ్ మొదలవక ముందు నుంచే డ్యాన్సింగ్ రోజ్×సమరల మధ్య జరిగే పోటీ గురించి షబ్బీర్ మాట్లాడుతుండేవారట. దీంతో అసలు రిహార్సల్ అవసరం లేకుండా నేరుగా బాక్సింగ్ రింగులోకి దిగిపోయారు. బాక్సింగ్ రింగులో ఓడిపోయినా ఆయన చేసిన విన్యాసాలకు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. అంతేకాదు, చివరిలో తన సహచరుడు వేటపులి ఓడిపోయిన సందర్భంలోనూ ధైర్యం చెప్పే సీన్‌లో ఆయన నటన మెప్పిస్తుంది.
డ్యాన్సింగ్ రోజ్ పాత్రకు స్ఫూర్తి ఎవరంటే?
‘సార్పట్ట’ సినిమాలో కనిపించే ప్రతి బాక్సర్ స్టైల్ వెనుక నిజమైన బాక్సర్లను స్ఫూర్తి తీసుకున్నారు దర్శకుడు పా.రంజిత్. సమర పాత్రలో కనిపించిన ఆర్య బాక్సింగ్ స్టైల్ మహ్మద్ అలీ శైలిని పోలి ఉంటుంది. వేటపులి(జాన్ కొక్కెన్) శైలి మైక్ టైసన్‌కు దగ్గరగా ఉంటుంది. ఇక డ్యాన్సింగ్ రోజ్ బాక్సింగ్‌కు బాక్సర్ నసీమ్ హమీద్ శైలిని స్ఫూర్తిగా తీసుకున్నారు. ఎందుకంటే నసీమ్ బాక్సింగ్ రింగ్‌లోకి దిగితే పాదరసంలా కదిలేవారట. ‘నసీమ్ బాక్సింగ్ శైలిని ఒక రిఫరెన్స్‌గా తీసుకున్నాం. ఆయన బాక్సింగ్‌కు సంబంధించిన కొన్ని వీడియోలను చూసి, ఆ యాక్షన్‌ను నా శరీరానికి అనువుగా మార్చుకున్నా’ అని డ్యాన్సింగ్ రోజ్ పాత్ర వెనుక షబ్బీర్ ఏ విధంగా కృషి చేశారో చెబుతారు. ఇక మార్షల్ ఆర్ట్స్, పర్కోర్ తదితర ఫిట్‌నెస్ స్కిల్స్‌ను నిరంతరం సాధన చేయడం వల్లే డ్యాన్సింగ్ రోజ్ పాత్ర అద్భుతంగా వచ్చిందని షబ్బీర్ అంటారు. బాక్సింగ్ రింగ్‌లో నా సొంత శైలిలో యాక్షన్ సీన్లు చేస్తానని చెబితే దర్శకుడు పా.రంజిత్, యాక్షన్ డైరెక్టర్ అన్బఅర్విలు ప్రోత్సహించేవారట. షబ్బీర్ ఇచ్చిన సలహాలను తీసుకునేవారట. ఇక సెట్స్‌లో పా.రంజిత్ చాలా స్నేహంగా ఉండేవారని, ఆర్య కూడా ఎంతో ప్రోత్సహించేవాడని షబ్బీర్ చెప్పారు. ‘ఆర్య’తో కలిసి చేసిన ‘టెడ్డీ’ మూవీకి భిన్నంగా ఇందులో కష్టపడాల్సి వచ్చేదట. రోజుకు 14 నుంచి 15 గంటలు శారీరకంగా కష్టపడేవాళ్లమని షబ్బీర్ ‘సార్పట్ట’ అనుభవాలను పంచుకున్నారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
K.Viswanath: కళాతపస్వి కె.విశ్వనాథ్ కన్నుమూత
-
General News
Telangana News: కొత్త సచివాలయంలో అగ్నిప్రమాదం
-
World News
Saudi Arabia: ఈ యువరాజు హయాంలో.. రికార్డు స్థాయి మరణశిక్షలు..!
-
India News
Jammu Kashmir: కశ్మీర్ ఉగ్రవాదుల కొత్త ఆయుధం.. పెర్ఫ్యూమ్ బాంబ్!
-
Sports News
PCB: పీసీబీ నిర్ణయం.. పాక్ క్రికెట్ వ్యవస్థకు ఎదురుదెబ్బ: మిస్బాఉల్ హక్
-
Crime News
Bull Race: ఎడ్ల పందేలకు అనుమతివ్వలేదని..వాహనాలపై రాళ్ల వర్షం