Sarpatta2: ఆర్య-పా.రంజిత్‌ మ్యాజిక్‌.. ‘సార్పట్ట 2’ వచ్చేస్తోంది!

ఆర్య కీలక పాత్రలో పా.రంజిత్‌ దర్శకత్వంలో వచ్చిన పీరియాడ్‌ స్పోర్ట్స్‌ యాక్షన్‌ ఫిల్మ్‌ ‘సార్పట్ట’. ఇప్పుడు ఈ సినిమాకు కొనసాగింపు పార్ట్‌-2 రాబోతోంది.

Published : 07 Mar 2023 01:28 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఆర్య కీలక పాత్రలో పా.రంజిత్‌ దర్శకత్వంలో వచ్చిన పీరియాడ్‌ స్పోర్ట్స్‌ యాక్షన్‌ ఫిల్మ్‌ ‘సార్పట్ట’. విజయన్‌, పసుపతి, కలైరసన్‌ కీలక పాత్రలు పోషించారు. కరోనా కారణంగా ఈ చిత్రం నేరుగా ఓటీటీలో విడుదలైంది. తమిళంలోనే కాదు, ఇతర భాషల్లోనూ మంచి టాక్‌ను తెచ్చుకుంది. ఇప్పుడు ఈ సినిమాకు కొనసాగింపుగా మరో చిత్రం రాబోతోంది. ‘సార్పట్ట: రౌండ్‌2’ పేరుతో ఈ మూవీని తీసుకొస్తున్నట్లు కథానాయకుడు ఆర్య వెల్లడించారు. ‘మ్యాచ్‌ చూసేందుకు మీరు సిద్ధమా? యాంగ్రీ ఇంగ్లీష్‌ బాక్సింగ్‌. రౌండ్‌2’ అని క్యాప్షన్‌ ఇచ్చారు. తొలి భాగంలో ‘సార్పట్ట’, ‘ఇడియప్ప’ పరంపరల మధ్య జరిగిన పోటీ చూపించగా, రెండో భాగంలో ఎవరి మధ్య మ్యాచ్‌జరుగుతుందో చూడాలి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని