Published : 07/12/2021 17:12 IST

Sasikala: సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ ఇంటికెళ్లిన శశికళ!

చెన్నై: తమిళ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌తో అన్నాడీఎంకే బహిష్కృత నాయకురాలు శశికళ భేటీ అయ్యారు. చెన్నైలోని పోయెస్‌ గార్డెన్‌లో రజనీ నివాసానికి నిన్న వెళ్లిన చిన్నమ్మ.. ఆయనతో కాసేపు మాట్లాడారు. అక్టోబర్‌ 25న ప్రఖ్యాత పురస్కారం దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డును అందుకొన్నందుకు రజనీకి అభినందనలు తెలపడంతో పాటు ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. అక్టోబర్‌ నెలాఖరులో అనారోగ్యంతో కావేరి ఆస్పత్రిలో చేరిన రజనీ.. ప్రస్తుతం ఇంటి వద్దే కోలుకుంటున్న విషయం తెలిసిందే.

తమిళనాడు దివంగత నేత జయలలితకు సన్నిహితురాలైన శశికళ.. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో బెంగళూరు కారాగారంలో నాలుగేళ్లు జైలు శిక్ష అనుభవించి ఈ ఏడాది జనవరిలో విడుదలయ్యారు. జయ మరణానంతరం 2017 సెప్టెంబర్‌ నెలలో అన్నాడీఎంకే నుంచి శశికళను అధికారికంగా తొలగించారు. ఆమె మళ్లీ అన్నాడీఎంకేలోకి వెళ్లేందుకు ప్రయత్నాలు చేసినా.. అవన్నీ బెడిసికొట్టాయి. ఆమెతో పాటు దినకరన్‌కు కూడా భవిష్యత్తులోనూ తమ పార్టీలో చోటు ఉండబోదంటూ అన్నాడీఎంకే నేతలు తెగేసి చెబుతున్నారు.

Read latest Cinema News and Telugu News

Read latest Movies News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని