ETV Win: ఈటీవీ విన్‌లో ‘శశి మథనం’ జోరు

బుల్లితెరపై తమ కామెడీతో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న సోనియా సింగ్, పవన్‌ సిద్ధు జంటగా నటించిన వెబ్‌సిరీస్‌ ‘శశి మథనం’. వినోద్‌ గాలి దీన్ని రూపొందించారు.

Published : 06 Jul 2024 01:23 IST

బుల్లితెరపై తమ కామెడీతో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న సోనియా సింగ్, పవన్‌ సిద్ధు జంటగా నటించిన వెబ్‌సిరీస్‌ ‘శశి మథనం’. వినోద్‌ గాలి దీన్ని రూపొందించారు. ‘దాగుడు మూతలు దండా కోర్‌.. ఎక్కడ ప్రేమికులు అక్కడే గప్‌చుప్‌’ అంటూ ఇటీవలే ప్రముఖ ఓటీటీ వేదికైనా ఈటీవీ విన్‌లో ప్రేక్షకుల ముందుకు వచ్చిందీ సిరీస్‌. ప్రేమకథా నేపథ్యంలో.. ఆకట్టుకునే సంభాషణలతో, సినీప్రియుల్ని నవ్వుల్లో ముంచెత్తుతున్న ఈ సిరీస్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. గతంలో ఈటీవీ విన్‌లో విడుదలై ఘన విజయాన్ని అందుకున్న    సిరీస్‌ తర్వాత ఆస్థాయి ఆదరణను దక్కించుకుంటున్నట్లు తెలిపింది సిరీస్‌ బృందం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని