Sathi Gani Rendu Ekaralu: ఏదో రోజు నువ్వు హీరో అవుతావని సుకుమార్‌ అనేవారు: ‘పుష్ప’ జగదీష్‌

‘పుష్ప’ ఫేం జగదీష్‌ హీరోగా దర్శకుడు అభినవ్‌ తెరకెక్కించిన చిత్రం ‘సత్తిగాని రెండెకరాలు’ ఓటీటీ ‘ఆహా’లో ఈ నెల 26న విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ట్రైలర్‌ విడుదల వేడుక జరిగింది.

Published : 24 May 2023 20:06 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘పుష్ప: ది రైజ్‌’ (pushpa) చిత్రంలో హీరో అల్లు అర్జున్‌ స్నేహితుడు కేశవగా కనిపించి, ప్రేక్షకుల్ని అలరించిన నటుడు.. జగదీష్‌ ప్రతాప్‌ బండారి (Jagadeesh). ఈయన హీరోగా నూతన దర్శకుడు అభినవ్‌ తెరకెక్కించిన చిత్రం ‘సత్తిగాని రెండెకరాలు’ (Sathi Gani Rendu Ekaralu). ఈ సినిమా నేరుగా ఓటీటీ (ott) ‘ఆహా’ (aha)లో ఈ నెల 26న విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం హైదరాబాద్‌లో ట్రైలర్‌ విడుదల వేడుక నిర్వహించింది. ఈ కార్యక్రమంలో హీరో సత్యదేవ్‌, దర్శకులు అనుదీప్‌ కె.వి., వెంకీ కుడుముల, హను రాఘవపూడి తదితరులు పాల్గొన్నారు.

వేడుకనుద్దేశించి జగదీష్‌ మాట్లాడుతూ.. ‘‘పుష్ప’ చిత్రంలో నాకు అవకాశం ఇచ్చిన దర్శకుడు సుకుమార్‌గారికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఆ సినిమాతో నాకు పాన్‌ ఇండియా స్థాయిలో గుర్తింపు దక్కింది. హీరో అల్లు అర్జున్‌ సర్‌ కూడా నాకు సపోర్ట్‌ చేశారు. నేను హీరోగా చేస్తున్నానని చెప్పగానే ఆయన ఆనందించారు. ‘పుష్ప’ చిత్రీకరణలో సమయంలో.. ‘ఏదో రోజు నువ్వు హీరో అవుతావురా’ అని సుకుమార్‌ అనేవారు. ఆయన నాతో సినిమా చేస్తానన్నారు. అయితే, ఆలోపు అభినవ్‌ చెప్పిన కథ గురించి ఆయనకు చెబితే, ఓకే అన్నారు. ‘సత్తిగాని రెండెకరాలు’ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరిస్తారని ఆశిస్తున్నా’’ అని పేర్కొన్నారు.

‘‘నేనూ జగదీష్‌ కలిసి ‘గాడ్స్‌ ఆఫ్‌ ధర్మపురి’ సిరీస్‌లో నటించాం. అందులోని చలపతి పాత్రలో తను ఒదిగిపోయాడు. జగదీష్‌ పెర్ఫామెన్స్‌ బాగా నచ్చడంతో దర్శకుడు అనీష్‌.. తక్కువ నిడివి ఉండే చలపతి అనే రోల్‌ని కీలకంగా మార్చాడు’’ అని సత్యదేవ్‌ నాటి సంగతులు గుర్తు చేసుకున్నారు. ‘‘పుష్ప’ సినిమాలోని జగదీష్‌ నటన నన్ను ఆకట్టుకుంది. బయటకు రాలేని పరిస్థితిలో ఉన్నా అతణ్ని చూసేందుకు ఈ వేడుకకు వచ్చా. సినిమాలో విజువల్స్‌, సంగీతం అద్భుతంగా ఉంటాయని ట్రైలర్‌ చూస్తే అర్థమవుతుంది’’ అని హను రాఘవపూడి అన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు