Sathyaraj: ఆ సూపర్‌హిట్‌ చిత్రంలో పాత్ర నచ్చకపోయినా నటించా: సత్యరాజ్‌

‘బాహుబలి’తో కట్టప్పగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులకు సుపరిచితులయ్యారు కోలీవుడ్‌ నటుడు సత్యరాజ్‌. దక్షిణాదిలో వరుస సినిమాలు చేస్తున్....

Published : 06 Jun 2022 12:54 IST

తొమ్మిదేళ్ల తర్వాత మనసులో మాటను బయటపెట్టిన నటుడు

చెన్నై: ‘బాహుబలి’తో కట్టప్పగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపుపొందారు కోలీవుడ్‌ నటుడు సత్యరాజ్‌. దక్షిణాదిలో వరుస సినిమాలు చేస్తోన్న ఆయన తాజాగా ఓ ఆంగ్ల పత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఓ స్టార్‌హీరో నటించిన సూపర్‌హిట్‌ చిత్రంలో పాత్ర నచ్చనప్పటికీ నటించానని అన్నారు. అది కూడా ఆ హీరో కోసమేనని తెలిపారు. ఇంతకీ సత్యరాజ్‌ చెప్పింది ఏ సినిమా గురించి అంటే.. షారుఖ్‌ ఖాన్‌ నటించిన ‘చెన్నై ఎక్స్‌ప్రెస్‌’.

బాలీవుడ్‌ దర్శకుడు రోహిత్‌శెట్టి రూపొందించిన ఫ్యామిలీ, కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌ ‘చెన్నై ఎక్స్‌ప్రెస్‌’. షారుఖ్‌ ఖాన్‌, దీపికా పదుకొణె నటీనటులు. ఇందులో దీపిక తండ్రి పాత్రలో సత్యరాజ్‌ నటించారు. లోకల్‌ మాఫియా నాయకుడిగా ఆయన కీలకపాత్ర పోషించారు. 2013లో ఈ సినిమా విడుదలై మంచి విజయం సాధించినప్పటికీ.. సత్యరాజ్‌ పాత్రకు ప్రేక్షకుల్లో అనుకున్నంత గుర్తింపు రాలేదు. ఇదే విషయంపై తాజాగా ఆయన స్పందించారు. ‘‘చెన్నై ఎక్స్‌ప్రెస్‌’లో పాత్ర కోసం చిత్రబృందం నన్ను సంప్రదించినప్పుడు నా పాత్ర వినగానే.. అది నాకంత గొప్ప పాత్రగా అనిపించలేదు. ఇదే విషయాన్ని షారుఖ్‌, దర్శకుడు రోహిత్‌ శెట్టితో చెప్పాను. కానీ, చివరికి షారుఖ్‌పై ఉన్న అభిమానంతో ఆసినిమా చేయాల్సి వచ్చింది. ఎందుకంటే, షారుఖ్‌ అంటే నాకెప్పటి నుంచో అభిమానం. ఆయన నటించిన ‘దిల్‌ వాలే దుల్హనియా లేజాయేంగే’ ఎన్నోసార్లు చూశా. ఆయన నటన నాకెంతగానో నచ్చింది. ఆయనతో నటించాలనే ఉద్దేశంతో ఆ సినిమా ఓకే చేశా’’ అని సత్యరాజ్‌ వివరించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని