Satyadev: సత్యదేవ్‌ మల్టీస్టారర్‌ షురూ

సత్యదేవ్‌, డాలీ ధనంజయ హీరోలుగా ఓ మల్టీస్టారర్‌ రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ఈశ్వర్‌ కార్తీక్‌ దర్శకుడు. బాల సుందరం, దినేష్‌ సుందరం సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

Updated : 01 Oct 2022 14:04 IST

త్యదేవ్‌ (Satyadev), డాలీ ధనంజయ హీరోలుగా ఓ మల్టీస్టారర్‌ రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ఈశ్వర్‌ కార్తీక్‌ దర్శకుడు. బాల సుందరం, దినేష్‌ సుందరం సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే పూజా కార్యక్రమాలతో లాంఛనంగా మొదలైన ఈ సినిమా.. శుక్రవారం నుంచి రెగ్యులర్‌ చిత్రీకరణ ప్రారంభించుకుంది. దీనికి సంబంధించిన ఫొటోలను సామాజిక మాధ్యమాల ద్వారా పంచుకుంది చిత్ర బృందం. ‘‘విభిన్నమైన క్రైమ్‌ యాక్షన్‌ కథాంశంతో రూపొందుతోన్న చిత్రమిది. సత్యదేవ్‌, ధనంజయ శక్తిమంతమైన పాత్రల్లో కనిపిస్తారు. త్వరలో మరిన్ని వివరాలు వెల్లడిస్తాం’’ అని చిత్ర వర్గాలు తెలిపాయి. ఈ సినిమాకి సంగీతం: చరణ్‌ రాజ్‌, కూర్పు: అనిల్‌ క్రిష్‌, ఛాయాగ్రహణం: మణికంఠన్‌ కృష్ణమాచారి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని