పెళ్లి పీటలెక్కనున్న ‘బాహుబలి’ సింగర్‌.. ఫొటోలు వైరల్‌

యువ గాయని సత్య యామిని త్వరలో పెళ్లి పీటలెక్కనుంది. కాబోయే భర్తను పరిచయం చేస్తూ ఆమె తాజాగా ఓ ఇన్‌స్టా పోస్ట్‌ పెట్టారు.

Updated : 04 Dec 2022 12:22 IST

హైదరాబాద్‌: ‘బాహుబలి’లోని ‘మమతల తల్లి’ పాటతో గాయనిగా గుర్తింపు తెచ్చుకున్న సత్య యామిని (Satya Yamini) త్వరలో పెళ్లి పీటలెక్కనుంది. వరుస సినిమాల్లో పాటలు పాడుతూ కెరీర్‌లో రాణిస్తోన్న ఆమె సోషల్‌మీడియా వేదికగా తనకు కాబోయే భర్తను పరిచయం చేస్తూ తాజాగా ఓ పోస్ట్‌ పెట్టింది. ‘జీవితకాలానికి సంబంధించిన రోలర్‌ కోస్టర్‌ వేచి ఉంది’ అని రాసుకొచ్చింది. ఈ ఫొటో చూసిన గీతామాధురి, అనుదీప్‌, మనీషా, పూజాతోపాటు పలువురు సింగర్స్‌ ఈ జంటకు శుభాకాంక్షలు చెప్పారు. క్యూట్‌ కపుల్‌ అంటూ కామెంట్స్‌ పెట్టారు. అయితే, తనకు కాబోయే వాడికి సంబంధించిన వివరాలను యామిని వెల్లడించలేదు.

ఈటీవీలో ప్రసారమవుతోన్న ‘పాడుతా తీయగా’, ‘స్వరాభిషేకం’ వంటి కార్యక్రమాలతో యామిని తెలుగు ప్రేక్షకులకు చేరువైంది. ‘బాహుబలి-2’ తర్వాత ఆమెకు తెలుగులో అవకాశాలు వరుస కట్టాయి. ‘శైలజారెడ్డి అల్లుడు’, ‘కొండపొలం’, ‘రాధేశ్యామ్‌’, ‘అఖండ’, ‘బింబిసార’, ‘అహింస’ వంటి చిత్రాల్లో ఆమె గీతాలను ఆలపించింది. Satya Yamini Official అనే యూట్యూబ్‌ ఛానల్‌ వేదికగా పలు పాటలకు ఆమె కవర్‌సాంగ్స్‌ చేసింది.Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని