Cinema News: విజయ్‌ చిత్రంలో సత్యదేవ్‌?

విజయ్‌ దేవరకొండ కథానాయకుడిగా గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతోన్న సంగతి తెలిసిందే.

Published : 01 Jun 2024 00:40 IST

విజయ్‌ దేవరకొండ కథానాయకుడిగా గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతోన్న సంగతి తెలిసిందే. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. స్పై యాక్షన్‌ థ్రిల్లర్‌గా ముస్తాబవుతున్న ఈ సినిమాలో హీరో సత్యదేవ్‌ కీలక పాత్రలో కనిపించనున్నారని సమాచారం. దీంట్లో ఆయనది పూర్తి నిడివి ఉన్న పాత్ర అని.. కథలో తన పాత్రకు ఎంతో ప్రాధాన్యముందని తెలిసింది. ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం వైజాగ్‌లో శరవేగంగా జరుగుతోంది. ఇందులో విజయ్‌కు జోడీగా భాగ్యశ్రీ బోర్సే నటిస్తోంది. అనిరుధ్‌ సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు