Krishnamma: సత్యదేవ్ ‘కృష్ణమ్మ’ టీజర్‌ వచ్చేసింది

సత్యదేవ్‌ (Satyadev) ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘కృష్ణమ్మ’ (Krishnamma). వి.వి.గోపాలకృష్ణ దర్శకుడు. గురువారం ఈ సినిమా టీజర్‌ను నటుడు సాయితేజ్‌ విడుదల చేశారు.... 

Published : 04 Aug 2022 13:28 IST

హైదరాబాద్‌: సత్యదేవ్‌ (Satyadev) ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘కృష్ణమ్మ’ (Krishnamma). వి.వి.గోపాలకృష్ణ దర్శకుడు. గురువారం ఈ సినిమా టీజర్‌ను నటుడు సాయితేజ్‌ విడుదల చేశారు. ‘‘ఈ కృష్ణమ్మలాగే మేమూ ఎప్పుడు పుట్టామో, ఎలా పుట్టామో ఎవ్వరికీ తెలియదు. ఎప్పుడు పుట్టినా, ఎలా పుట్టినా పుట్టిన ప్రతివాడికి ఏదో ఒక కథ ఉండే ఉంటది’’ అంటూ సత్యదేవ్‌ చెప్పే డైలాగ్‌తో ప్రారంభమైన ఈ టీజర్‌ ఆద్యంతం ఆకట్టుకునేలా సాగింది. సంభాషణలనుబట్టి చూస్తే ఈ సినిమాలో హీరో, ఆయన స్నేహితులందరూ అనాథలని తెలుస్తోంది. చిన్నతనం నుంచి కలుసున్న వీరందరూ అనుకోని విధంగా కొందరు వ్యక్తుల వల్ల ఇబ్బందులు ఎదుర్కొవడం.. వాటి నుంచి తప్పించుకునే క్రమంలో ఎన్నో కష్టాలు పడటం వంటి సన్నివేశాలతో ఇది రూపుదిద్దుకొంది. భవానీ మాల ధరించి, కత్తి చేతపట్టి శత్రువులపై పోరాటానికి వెళ్తోన్నట్లు టీజర్‌ చివర్లో సత్యదేవ్‌ కనిపించారు. ఆయన యాంగ్రీ లుక్‌ అభిమానుల్ని అలరించేలా ఉంది. ప్రముఖ దర్శకుడు కొరటాల శివ సమర్పణలో అరుణాచల క్రియేషన్స్‌ పతాకంపై కృష్ణ కొమ్మలపాటి దీన్ని నిర్మిస్తున్నారు. చిత్రీకరణ పూర్తి చేసుకొన్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని