Satyadev: ముగ్గురు గర్ల్‌ఫ్రెండ్స్‌ ఉన్నారు.. టికెట్లు ఇప్పించాలని నెటిజన్‌ ట్వీట్‌.. సత్యదేవ్‌ కౌంటర్‌

‘లవ్‌ మాక్‌టైల్‌’కు రీమేక్‌గా తెరకెక్కిన ‘గుర్తుందా శీతాకాలం’ డిసెంబర్‌ 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈనేపథ్యంలో సత్యదేవ్‌ వరుస ప్రమోషన్స్‌లో బిజీగా పాల్గొంటున్నారు. తాజాగా ఆయన నెటిజన్లతో ట్విటర్‌ చాట్‌ నిర్వహించారు.

Updated : 08 Dec 2022 10:37 IST

హైదరాబాద్‌: ‘గాడ్‌ఫాదర్‌’ (Godfather), ‘రామ్‌సేతు’ (Ramsetu)లో కీలకపాత్రలు పోషించి సినీ ప్రముఖులు, అభిమానుల ప్రశంసలు అందుకున్నారు నటుడు సత్యదేవ్‌. ప్రస్తుతం తన తదుపరి చిత్రం ‘గుర్తుందా శీతాకాలం’ (Gurthunda Seethakalam) ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్న ఆయన.. తాజాగా నెటిజన్లతో ట్విటర్‌ చాట్‌లో పాల్గొన్నారు. అభిమానులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు..

‘రామ్‌సేతు’లో ఏపీగా మీ నటన నాకెంతో నచ్చింది. మీ తదుపరి చిత్రాలను హిందీలోనూ విడుదల చేయండి? లేదా బాలీవుడ్‌ చిత్రాల్లో నటించండి?

సత్యదేవ్‌: మీరు నాపై చూపిస్తోన్న ప్రేమాభిమానాలకు సంతోషిస్తున్నా. భవిష్యత్తులో తప్పకుండా మిమ్మల్ని అలరించడానికి మరిన్ని ప్రాజెక్ట్‌లు చేస్తాను. 

ఒకవేళ నటుడు కాకపోయి ఉంటే మీరు ఏ రంగాన్ని ఎంచుకునేవారు?

సత్యదేవ్‌: నువ్వు అడిగే వరకూ ఆలోచించలేదు. దర్శకుడిని అయ్యేవాడినేమో.

ఎన్టీఆర్‌తో కలిసి మీరు నటిస్తే చూడాలని ఉంది?

సత్యదేవ్‌: గట్టిగా కోరుకోండి. నేను కూడా ఎదురుచూస్తున్నా.

‘రామ్‌సేతు’ కోసం అక్షయ్‌కుమార్‌తో కలిసి పనిచేయడం ఎలా ఉంది?

సత్యదేవ్‌: అక్షయ్‌ కుమార్‌ అంటే ప్రేమ. ఆయనతో మరెన్నో చిత్రాల్లో నటించాలని ఉంది. ఈ సినిమా తర్వాత ఆయనకు వీరాభిమాని అయిపోయా.

రీమేక్స్‌ మీద ప్రేక్షకులు ఆసక్తి కనబర్చడం లేదు కదా. అలాంటప్పుడు ‘గుర్తుందా శీతాకాలం’ను థియేటర్‌లో ఎందుకు రిలీజ్‌ చేస్తున్నారు? ఓటీటీకి ఇవ్వొచ్చుగా

సత్యదేవ్‌: ఓటీటీకి అడిగారు. కాకపోతే, ఈ చిత్రాన్ని థియేటర్‌లో చూస్తేనే ఆ ఫీల్‌ వస్తుందని భావించాం.

చిరంజీవితో కలిసి వర్క్‌ చేయడం ఎలా ఉంది?

సత్యదేవ్‌: మేజికల్‌గా అనిపించింది. ఆ రోజుల్ని జీవితాంతం గుర్తు పెట్టుకుంటా.

నువ్వు ఏం చేస్తావో తెలియదు.. పవన్‌-సుజిత్‌ సినిమాలో మాకు అనిరుధ్‌ కావాలి?

సత్యదేవ్‌: నాది కూడా సేమ్‌ ఫీలింగ్‌.

‘గుర్తుందా శీతాకాలం’ ఎలా ఉండనుంది?

సత్యదేవ్‌: నవ్వుతారు, ప్రేమిస్తారు, కన్నీరు పెట్టుకుంటారు. సినిమా చూశాక.. దీన్ని చూడమని మీ స్నేహితులకు తప్పకుండా చెబుతారు. అలాగే, ఒకే టికెట్‌పై మూడు ప్రేమ కథలు చూడనున్నారు.

తమన్నాతో కలిసి పనిచేయడం ఎలా ఉంది? ఆమె నుంచి ఏం నేర్చుకున్నారు?

సత్యదేవ్‌: వృత్తి పట్ల నిబద్ధత కలిగిన వ్యక్తి. స్వీట్‌ హార్ట్‌

నీ పలుకుబడి ఉపయోగించి #SSMB28 అప్‌డేట్‌ ఇప్పించు..!

సత్యదేవ్‌: నా పలుకుబడితో ‘గుర్తుందా శీతాకాలం’ టికెట్‌ ఇప్పించగలను. కానీ, #SSMB28 అప్‌డేట్‌ ఎలా?

సినిమాపై కాస్త కూడా ఆసక్తి రావడం లేదు. బాగుంటే మెసేజ్‌ చెయ్‌.. టికెట్‌ బుక్ చేసుకుంటా?

సత్యదేవ్‌: చూశాను.. బాగుంది.. బుక్‌ చేసుకో..

మీ డ్రీమ్ రోల్‌ ఏమిటి?

సత్యదేవ్‌: చిరంజీవి చేసిన చంటబ్బాయ్‌!!

నాకు ముగ్గురు గర్ల్‌ఫ్రెండ్స్‌ ఉన్నారు. మీ సినిమా కథ నాకు కనెక్ట్‌ అయ్యేలా ఉంది. మూడు టికెట్లు ఇప్పించండి..!

సత్యదేవ్‌: మూడు టికెట్లా? అంటే నువ్వు రావడం లేదా?

‘రామ్‌సేతు’లో ఏపీ పాత్ర పోషించడానికి మీరు ఎలా సన్నద్ధమయ్యారు?

సత్యదేవ్‌: పూర్తిగా శాకాహారిగా మారాను. సుమారు రెండు నెలలపాటు సోషల్‌మీడియాకు దూరంగా ఉన్నాను.

పవన్‌కల్యాణ్‌, రామ్‌చరణ్‌, ప్రభాస్‌, అల్లు అర్జున్‌, ఎన్టీఆర్‌ గురించి ఏమైనా చెప్పండి?

సత్యదేవ్‌: పవర్‌స్టార్‌ - ఫైర్‌ స్ట్రోమ్‌
చరణ్‌ - మోస్ట్‌ లవబుల్‌ స్టార్ ఆఫ్‌ ఇండియా
తారక్‌ - టార్చ్‌ బేరర్‌
బన్నీ - ఐకాన్‌
ప్రభాస్‌ - మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌

చిరంజీవి గురించి ఒక్కమాటలో చెప్పండి?

సత్యదేవ్‌: ఆయన గురించి ఒక్క మాటలో చెప్పడం చాలా కష్టం. ఆయన అంటే చాలా ప్రేమా, అభిమానం ఉన్నాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని